ప‌వ‌న్‌పై జ‌గ‌న్  పొలిటిక‌ల్ పాచిక‌!

ఏపీలో రాజ‌కీయాలు ఏ క్ష‌ణాన ఎలా మార‌తాయ‌నేది అంచ‌నా వేయ‌టం క‌ష్ట‌మే. కుల ప్రాతిప‌దిక‌న ఓట‌ర్లు చీలిపోయారు.  ఏ వ‌ర్గం ఎవ‌రివైపు నిలుస్తుంది.. దీని ప్ర‌భావం ఏ పార్టీపై ప‌డుతుంద‌నేది లెక్క‌క‌ట్టేందుకు పార్టీలు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీల‌కు 2019 ఎన్నిక‌లు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌. అందుకే.. గెలిచితీరాలనే క‌సితో పావులు క‌దుపుతున్నారు. ఇక్క‌డ నీతి నియ‌మాలు, విలువ‌లకు తావేలేదు. ఎందుకంటే యుద్ధంలో గెల‌వ‌ట‌మే ప్ర‌ధానం.. అదే రాజ‌నీతి. దీనికోసం కాని వారిని కావ‌లించుకుంటారు. అయిన‌ వారి పీక ప‌ట్టుకుంటారు. టీడీపీ ఎత్తులో భాగ‌మే బీజేపీను దూరం పెట్ట‌డం.. మ‌రో పార్టీతో పొత్తులేకుండా ఒంట‌రిగా బ‌రిలోకి దిగ‌టం.. వైసీపీది కూడా సేమ్ ఇదే మార్గం.. ఒంట‌రిగా బ‌ల‌నిరూప‌ణ‌.. త‌మ అధికారం మ‌రోక‌రి చేతిలో ఉంచ‌ట‌మ‌నేది జ‌గ‌న్ అస్స‌లు అంగీక‌రించ‌డంటారు ఆ పార్టీ సీనియ‌ర్లు. ఈ ఇద్ద‌రికీ కామ‌న్ ప్ర‌త్య‌ర్థి జ‌న‌సేన‌.. అయితే రేప‌టి ఎన్నిక‌ల వేళ‌.. టీడీపీ, జ‌న‌సేన జ‌ట్టుక‌ట్టే అవ‌కాశాలున్నాయి.
కానీ. జ‌గ‌న్ వైపు చూసేందుకు 99 శాతం స్కోప్ లేదు. అందుకే.. ప‌వ‌న్ ఇమేజ్‌ను దెబ్బ‌తీసి.. రాజ‌కీయంగా కోలుకోకుండా చేయాల‌నే ఎత్తుగ‌డ‌తో.. జ‌గ‌న్ వ‌ర్గ‌మే.. సినీ రంగంలోని లోపాల‌ను వెలికితీసి.. ప్ర‌తి అంశంలోనూ మెగాఫ్యామిలీ.. ఇప్పుడు ఏకంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను తిట్టిస్తుంద‌నే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు ప‌వ‌ర్ ఫ్యాన్స్‌. దీనివ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కూ వైసీపీలో కాపు సామాజిక‌వ‌ర్గ నేత‌లు.. అభిమానులు కూడా దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని.. కొంద‌రు జ‌గ‌న్‌తో చ‌ర్చించిన‌ట్లు కూడా స‌మాచారం. అందుకే.. ఈ వ్య‌వ‌హారంలో త‌మ చేతికి మ‌ట్టి అంటకుండా ప్ర‌యివేటు వ్య‌క్తుల ద్వారా బ‌య‌ట నుంచే చ‌క్రం తిప్పుతున్న‌ట్లు విమ‌ర్శ‌లున్నాయి. ఇదే నిజ‌మ‌ని తేలితే.. రాబోయే రోజుల్లో ప‌వ‌న్ వ‌ర్సెస్ జ‌గ‌న్ మ‌ధ్య వార్ తారాస్థాయికి చేరే అవ‌కాశాలు లేక‌పోలేదు. మ‌రి దీన్ని సెటిల్ చేసేందుకు కామ‌న్ మిత్రుడు బీజేపీ రంగంలోకి దిగుతుందా… లేక పోన్లే.. ఇద్ద‌రూ కొట్టుకుంటే.. మ‌నం లాభ‌ప‌డ‌వ‌చ్చ‌ని వ్యూహ‌ర‌చ‌న‌కు ప‌ద‌నుపెడుతుందా.. ఏమైనా ఇప్ప‌టి వ‌ర‌కూ చాప‌కింద‌నీరులా జ‌రుగుతున్న వ్య‌వ‌హారాలు వెలుగుచూస్తే.. ఎటువంటి రాజ‌కీయాలు చూడాల్సి వ‌స్తుందో!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*