చక్రం తిప్పుతున్న గాలి

కర్నాటక బీజేపీ లో మళ్లీ మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి శకం మొదలైంది. జైలు నుంచి బయటకొచ్చాక ఆయన పూర్తి స్థాయిలో పావులు కదుపుతున్నారు. బళ్లారినే కాదు.. చాలా చోట్ల తన అనుచరులను రంగంలోకి దింపుతున్నారు. ఇందుకయ్యే ఖర్చును ఆయనే భరిస్తున్నారు. ఎంతగా అంటే గాలి జనార్దన్ రెడ్డిని అనుచరులు సిఎంగా పోలుస్తున్నారు. తన కుటుంబ సభ్యులు, అనుయాయులు కొందరికి కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్లు ఇప్పించుకున్నారు గాలి. గాలి జనార్ధన రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర రెడ్డి (బళ్లారి) పోటీ చేయబోతున్నారు. జనార్దనరెడ్డికి సన్నిహితుడైన బి.శ్రీరాములు సమీప బంధువు పకీరప్ప కు టిక్కెట్ వచ్చింది. కాగా అవినీతి కేసును ఎదుర్కుంటున్న మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్య నాయుడుకు టిక్కెట్ రావడం వెనుక గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు. తన అనుచరులతో పోటీ చేయించే గాలి జనార్దన్ రెడ్డి మరోవైపు ఏపీ రాజకీయాల్లోను అడుగేస్తున్నట్లు తెలుస్తోంది.
రాబోయే కాలంలో వైకాపా అధినేత జగన్ తో ఆయన సంబంధాలను మరింతగా పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. గతంలో ఉన్న దూకుడు ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిలో లేవు. దైవభక్తుడిగా మారాడు గాలి. జైలుకు వెళ్లి వచ్చాక జ్ఞానోదయం అయిందనుకుంటా. అందుకే సిఎం చంద్రబాబునాయుడు అంతు తేలుస్తానని చెప్పిన వ్యక్తి.. అసుల ఏబీఎన్ రాధాకృష్ణ సంగతి చూస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. అయినా సరే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో గాలి జనార్దన్ రెడ్డి తన కేసుల నుంచి బయట పడేందుకు చూస్తున్నారు. ఇప్పటికే చాలా కేసుల నుంచి బయట పడ్డారు. మరిన్ని కేసుల నుంచి బీజేపీ అతనికి ఉపశమనం కలిగించింది. కర్నాటక ఎన్నికల్లో అతని సేవలను బాగా వినియోగించుకుంటోంది బీజేపీ. ఫలితంగా గాలి ఇప్పుడు పూర్తి స్థాయి క్రియాశీలకంగా మారాడు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*