స్పీకర్ కూడ దీక్ష చేస్తాడట

స్పీకర్ అంటే రాజ్యంగ బద్దమైన పదవిలో ఉంటారు. అందరికీ ఆదర్శంగా ఉండాలి. అన్ని పార్టీలను సమానంగా చూడాలి. అలాంటి వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా.. లేక వ్యతిరేకంగా వ్యవహరించరు. కాలం మారింది. ఇప్పటి స్పీకర్లు అలా ఉండటం లేదు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. విపక్ష నేతలపై విరుచుకుపడుతున్నారు. ఫలితంగా అసలు స్పీకర్ పదవినే ఆయన అవమానిస్తున్నారంతగా చర్చ సాగుతోంది. మరోవైపు మంత్రి పదవి కోసం ఆయన గట్టి ప్రయత్నమే చేస్తున్నారట. టీడీపీ-బీజేపీ వివాదంతో కామినేని వదిలేసిన మంత్రి పదవిని తనకు ఇవ్వాలని బలంగా కోరుతున్నాడు. తన స్థానంలో పొన్నూరులో వరుసగా ఐదుసార్లు గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను స్పీకర్ గా ఎంపిక చేయాలని కోరుతున్నారు స్పీకర్. కానీ సిఎం చంద్రబాబునాయుడు ఏం తేల్చకుండా ఉంచారు. 
ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు స్పీకర్ కూడ ఉద్యమ బాట పడుతున్నారు. ఏపీకి బీజేపీ చేస్తున్న అన్యాయంపై గళం విప్పనున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షకు మద్దతుగా ఈనెల 19న స్పీకర్ కోడెల శివప్రసాద్ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు కోడెల సైకిల్‌ యాత్ర సాగనుంది. కోడెల సత్తెనపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా..నరసరావుపేట అంటే ప్రాణం. అందుకే అక్కడే ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సైకిల్ యాత్ర తర్వాత ఈనెల 20న స్పీకర్‌ కోడెల దీక్షలో కూర్చోనున్నారు. ఫలితంగా స్పీకర్ దీక్ష చేస్తారా అనే చర్చ సాగుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*