రంగ స్థలం వసూళ్లు నిజం కాదా…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్ గా నటించిన చిత్రం రంగస్థలం. సినిమా బాగానే ఆడుతోంది. కాకపోతే మగధీరలా వసూళ్ల రికార్డును పెంచారట. రామ్ చరణ్ కు హైప్ తెచ్చేందుకే ఈ పనిచేశారంటున్నారు. గతంలో ఇలానే వేషాలు వేస్తే దర్శక ధీరుడు రాజమౌళి గడ్డిపెట్టారు. అల్లు అరవింద్ కు చెప్పాను. అయినా సరే లేనిది ఉన్నట్లు చెప్పారు. వచ్చిన వసూళ్లు ఎంత కచ్చితంగా చెప్పాలి. అలా చేయక పోవడం మంచిది కాదన్నారు. ఆయన మాటలకు ఇంత వరకు అల్లు అరవింద్ నుంచి కౌంటర్ లేదు. అంటే రాజమౌళి చెప్పింది నిజమనే నమ్మాల్సి ఉంటోంది. రికార్డుల కోసం తప్పులు చెప్పడం సినీ పరిశ్రమకు మంచిది కాదు. కానీ ఇప్పుడు రంగస్థలం విషయంలోను అదే జరుగుతోంది. 
సుకుమార్ దర్శకత్వంలో రంగస్షథలం మార్చి 30 న విడుదలైంది. టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు కొత్త కళ తీసుకొచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో అజ్ఞాతవాసి, జై సింహ సినిమాలు బాగానే ఆడాయి. వాటితో పాటు భాగమతి, తొలిప్రేమ చిత్రాలు తన వంతుగా ఊపు ఊపాయి. వాటిన్నింటిలోకి మంచి హిట్ కొట్టింది రంగస్థలం. అందులో ఎవరూ కాదనరు. రంగస్థలం కలెక్షన్స్ ఖైదీ నెంబర్ 150  ని దాటిందిట. నాన్ బాహుబలి రికార్డులను నెలకొల్పింది. అంచనాల్ని మించి విజయం సాధించిన ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల షేర్ మార్కును దాటిందని ప్రకటించుకున్నారు. 
చిరు 150 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసిన రంగస్థలం తో  రామ్ చరణ్ తండ్రిని తలదన్నే కొడుకుగా అవతరించాడు. కానీ రంగస్థలం రికార్డును భారీ ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ తో సభ పెట్టించి మరీ రామ్ చరణ్ ఈ కార్యక్రమాన్ని పెట్టించారు. దీనికి చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. మెగా హీరోలు 8 మందిలో ఇద్దరే అక్కడ ఉన్నారు. మిగతా వారిని అసలు ఆహ్వానించలేదు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు రంగస్థలం సినిమా వసూళ్లు రూ.175 కోట్లు కోట్లు దాటిందని ప్రకటించారు నిర్మాతలు. అందుకు బలం చేకూర్చేలా మరో పోస్టర్ ని వేశారు. కానీ అందులో ఓ తిరకాసు పెట్టారు. నాన్ బహుబలి మూవీస్ లో ఈ రికార్డు అని చిన్న అక్షరాలతో ఎడమవైపును వేశారు. అది పెద్దగా ఎవరికీ కనపడదు. ఫలితంగా రంగస్థలం కలెక్షన్స్ నిజం కాదేమో అనుకుంటున్నారు జనాలు. ఫలితంగా రంగస్థలంకు వచ్చిన గుడ్ విల్ దెబ్బతింటోంది. గతంలో మగధీర సినిమాకు చేసిన వసూళ్లు తప్పు ఇప్పుడు చేస్తున్నారనే చర్చ సోషల్ మీడియాలో వస్తోంది. 
బాహుబలిని మించలేదు…
బాహుబలి సినిమా దాటే సినిమా ఇప్పట్లో తెలుగులో రావడం అంత తేలిక కాదు. తెలుగులోనే కలెక్షన్స్ పరంగా నెంబర్ 1 స్థానం రంగస్థలం అని అర్థం వచ్చేలా ఆ పోస్టర్ ఉంది. ఫలితంగా రామ్ చరణ్ ను మరీ ఆకాశానికి ఎత్తే ప్రయత్నం జరుగుతోంది. అభిమానంతో తమకు తెలియకుండానే రామ్ చరణ్ కు నష్టం చేస్తున్నారనే వాదన లేకపోలేదు. బాహుబలి ఉండగా రంగస్థలం తెలుగులో బిగ్గెస్ట్ హిట్ ఎందుకు అవుతుందనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఆ పోస్టర్ లో ఎడమ వైపు… కనిపించీ కనిపించకుండా చిన్న అక్షరాల్లో నాన్-బాహుబలి అని డిస్క్లైమర్ వేశారు. మీరు చూడండి. అది కనపడుతుందో లేదు. 
కాలేజిలు ఇలానే చేస్తాయి…
టెన్త్, ఇంటర్ రిజల్స్ వస్తే తామే నెంబర్ వన్ అని చాలా కాలేజిలు ప్రకటించుకుంటాయి. తీరా చూస్తే తాము గతంలో సాధించామనో…ఒక సబ్జెక్టులో నెంబర్ వన్ అనో. మహిళల విభాగంలో నెంబర్ వన్ అనో. జిల్లా, మండల వారిగా నెంబర్ వన్ అనో చిన్న అక్షరాల్లో ఉంటోంది. అలానే ఉంది ఇప్పుడు రంగస్థలం రికార్డు కోసం వేసిన పోస్టర్. ఫలితంగా మరీ ఇంతగా జనాల చెవిలో వెర్రి పూలు పెట్టాలా అంటున్నారు. రంగస్థలం హిట్ అయింది. కానీ ఇలాంటి అనవసరం ప్రచారం వల్ల ఆ సినిమా పై వ్యతిరేక ప్రచారం వచ్చే వీలుంది. నిర్మాతలు అది గ్రహిస్తేనే మేలు. లేకపోతే అసలుకే మోసం వస్తోందని తెలుసుకోవాలి.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*