పవన్ మసాజ్ గుట్టు రట్టు

శ్రీరెడ్డి రేపిన సంచలనం ఇప్పుడు చిచ్చు రేపుతోంది. ముఖ్యంగా ఆ నలుగురు సినీ పెద్దలపై ప్రభావం పడింది. ఎంతగా అంటే వారి పేరు చెబితేనే ఇప్పుడు వణికిపోతున్నారు. చిరంజీవి కాంపౌండ్ లో ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. అమ్మాయిలకు వేషాలు ఇప్పిస్తామని చెప్పిన మెగా ఫ్యామిలీ వ్యవహారాలు చూసే మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడా అప్పారావు ఆకృత్యాలను బయట పెట్టింది శ్రీరెడ్డి. నాని, దిల్ రాజు, ఐడల్ శ్రీరామ్, శివాజీ రాజా, వైవా హర్ష, శ్రీకాంత్, దగ్గుబాటి సురేష్ కుమారుడు అభినయ్ వంటి వారి పేర్లు బయట పెట్టింది. వారే కాదు.. పవన్ కల్యాణ్ తక్కువేం కాదని చెప్పింది మరో నటి శృతి. అసలు శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆందోళన వ్యక్తం చేసింది మరోనటి అపూర్వ. శ్రీరెడ్డికి సాయం చేయవద్దని తనకు వేధింపులు వచ్చాయని చెప్పింది మరో నటి హేమ. ఇలా ఒక్కొక్కరుగా తమ సంగతులను బయట పెట్టారు. 
భయపడ్డ చిరంజీవి…
తన దగ్గర పని చేసే మేనేజర్ వాకాడ అప్పారావు ఇలా చేశాడని తెలియడంతో చిరంజీవి ఆయన్ను విధుల నుంచి తప్పించారు. మరోవైపు ఆయనపై మా అసోసియేషన్ చర్యలకు దిగుతోంది. ఫలితంగా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకుంది. ఇంకోవైపు కేసీఆర్ సర్కార్ ఈ విషయంలో మీనమేషాలు లెక్కపెడుతోంది. ఫలితంగా మహిళాలోకం అంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది. చిరంజీవికి తెలిసే ఈ తంతు అంతా జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 30 సార్లు ఆపరేషన్లు చేయించుకున్న వారు హీరోలుగా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.   
పవన్ మసాజ్ గుట్టును రట్టు చేసిన నటి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు మసాజ్ చేయాలంటే బెంగాళీ అమ్మాయిలను తీసుకురావాలట. ఈ సంగతిని బయట పెట్టింది మరో నటి శృతి. అసలు పవన్ ప్యాకేజిలకు అమ్ముడు పోయాడని చెప్పింది. అందుకే మహిళా లోకం అసలు పవన్ కల్యాణ్ కు ఓటేయవద్దని పిలుపునిచ్చింది. మా జీవితాలను నాశనం చేసిన సినీ పెద్దలను వదిలేది లేదని చెప్పింది. ముసలోడు వాకాడా అప్పారావు ఎందరో అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని చెప్పింది. అంతేకాదు.. అంతా హీరోలకు తెలిసే జరిగిందని ఆరోపించింది. రూ.200 కోట్లతో పవన్ కల్యాణ్ ఇళ్లు కడుతున్నారంటేనే ఎంతగా పవన్ ప్యాకేజిలకు అమ్ముడుపోయారో తెలుస్తుందని విమర్శించింది జ్యోతి. అల్లు అరవింద్, దగ్గుబాటి వంటి నాలుగు కుటుంబాల చేతిల్లోనే పరిశ్రమ ఉందన్నారు. వారే హీరోలుగా ఉండాలి. ఒక్కడంటే ఒక్కడన్నా హైట్ ఉన్నారా అంటూ దెప్పిపొడిచిందామె. ప్రభాస్ లాంటి వారు తప్ప మరెవరు హీరోలుగా పనికి రారని చెప్పింది. వారి ఆస్తులు తరతరాలు చెదిరిపోకుండా ఉండేందుకే హీరోలను చేస్తున్నారని నటి జ్యోతి అనడం కలకలం రేపుతోంది. మరోవైపు మహిళా సంఘాలు వారికి అండగా ఉండటంతో ఇప్పుడు టాలీవుడ్ లో కలకలం రేగుతోంది.  
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*