ఢిల్లీ పేరు చెబితేనే వణుకుతున్న పవన్ కల్యాణ్

ఏపీకి జరుగుతున్న అన్యాయంపై వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మొన్న బెజవాడలో పాదయాత్ర చేశారు. అంతకు ముందు కాకానిలో సభలో మాట్లాడారు. తిరుపతి, అనంతపురంలోను సభలు నిర్వహించనున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ హస్తినలో పోరాటం చేద్దామని రమ్మన్నారు కమ్యూనిస్టులు. అంతే పవన్ కాదన్నాడు. అసలు అలా ఎందుకు అన్నాడో కామ్రేడ్స్ కు అర్థం కాలేదు. బీజేపీ చేతిలో పవన్ కల్యాణ్ కీలుబొమ్మలా మారాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్ కు సంబంధింన రహస్యాలు కొన్ని పెన్ డ్రైవ్ లో ఉన్నాయని.. అవి బీజేపీ చేతికి చిక్కాయని తెలుస్తోంది. అందుకే బీజేపీ చెప్పినట్లు నడుచుకోవడం తప్ప పవన్ కల్యాణ్ ఏం చేయలేడంటున్నారు. అందుకే పవన్ యూటర్న్ తీసుకున్నారనే వాదన సాగుతోంది. 
పెన్ డ్రైవ్ భయం
టీడీపీ అధినేత, సిఎం చంద్రబాబు నాయుడు అద్భుతమైన పాలన అందిస్తున్నారని చెప్పారు పవన్. అది చెప్పిన పదిరోజులకే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అత్యంత అవినీతి పరులని ముద్రవేశారు. ఇదంతా తావీదు మహిమలా ఉంది. పెన్ డ్రైవ్ మహిమ. అందుకే పవన్ అలా మారిపోయాడని చెబుతున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ కు మహిళలతో సంబంధాలు బాగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఆయనకు మసాజ్ చేయాలంటే బెంగాళీ అమ్మాయిలే కావాలి. అలా ఉండే పవన్ మాకు బుద్దులు చెబుతారా అంటూ శ్రీరెడ్డికి మద్దతునిచ్చేందుకు వచ్చిన సినీ నటులు ఆరోపించారు. ఫలితంగా పవన్ కల్యాణ్ భయపడుతున్నారంటున్నారు. నటి పూనమ్ కౌర్ విషయంలో పవన్ కల్యాణ్ నిండా ఇరుక్కున్నాడనే వాదనుంది. ఇందుకు సంబంధించిన కీలక ఆడియో, వీడియోలు ఇప్పుడు బీజేపీ చేతిలోకి వెళ్లాయట. అక్కడికే కాదు.. టీడీపీ చేతికి చిక్కాయనే ప్రచారం సాగుతోంది. సి.ఎం చంద్రబాబు నాయుడు వాటిని తెప్పించారని రానున్నకాలంలో వాటితో ఒక ఆట ఆడుకుంటారని చెబుతున్నారు. 
ఏపీకి ప్రత్యేక హోదా కోసం హస్తిన పెద్దల మీద ఒత్తిడి పెంచాలి. అప్పుడే కేంద్రం దిగివస్తోంది. ఈ సంగతి ఎవరిని అడిగినా చెబుతారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం అది నిజం కాదంటున్నారు. ఢిల్లీ పెద్దల మీద పోరాడాలంటే ఢిల్లీకి ఎందుకు అంటున్నారు. ఏపీలో ఉండి పోరాటం చేయాలంటున్నారు. అందుకే కామ్రేడ్స్ కు పవన్ కల్యాణ్ మీద అనుమానం వస్తోంది. ఏదో పవన్ ను కలుపుకుపోతే నాలుగు సీట్లు వస్తాయని అనుకున్నాం. కానీ అతను సహకరించే పరిస్థితి లేదు. పైగా తన వల్ల మిగతా వారికి పేరు వస్తుందని భయపడుతున్నారు. ఇలాంటి స్థితిలో ఏం చేయాలా అని వామపక్ష నేతలు భావిస్తున్నారు. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*