మోహ‌న్ రెడ్డి స‌వాల్ దుమారం లేపుతుంది

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించే విషయంలో అధికార తెలుగుదేశంపార్టీ, ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. సవాళ్లు-ప్రతిసవాళ్లకు అయితే లెక్కేలేదు! నాయకులన్నాక సవాళ్లు విసురుకోవడం.. ప్రజలు వినడం పరిపాటిగా మారిందనుకోండి.. అయితే రీసెంట్‌గా అసెంబ్లీ వేదికగా కర్నూలు తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే ఎస్‌.వి.మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి చేసిన సవాల్‌ మాత్రం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో బాణంలా దూసుకెళ్లింది. ప్రత్యేకహోదా అంశంపై అధికార తెలుగుదేశంపార్టీ యూటర్న్‌ తీసుకుని డ్రామాలాడుతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. జగన్మోహన్‌రెడ్డి నాలుగేళ్ల కాలంలో ప్రత్యేకహోదాపై ప్రధాని నరేంద్రమోదీని ఒక్కసారైనా విమర్శించినట్లు ఒక్క వీడియో క్లిప్పింగ్‌ చూపించినా చాలు వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మోహన్‌రెడ్డి సవాల్‌ విసిరారు.
తమ అధినేతకే మోహన్‌రెడ్డి సవాల్‌ విసరడంపైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు సీరియస్‌గా తీసుకుని తీవ్రంగా చర్చించారట! మోహన్‌రెడ్డి సవాల్‌కు వైకాపా నేతలు సమాధానం వెతికేందుకు కృషి చేస్తున్న క్రమంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో ఇటీవల జరిగిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి అకగా జగన్‌కు చేసిన అసెంబ్లీ వేదిసవాల్‌ను మరోసారి రిపీట్‌ చేశారు. తాను చేసిన సవాల్‌కు రోజులు గడుస్తున్నా వైకాపా నుంచి సమాధానం రావడం లేదంటే ప్రధాని మోదీని జగన్‌ పల్లెత్తుమాటైనా అనలేదని అర్థమవుతోందని మోహన్‌రెడ్డి అన్నారు. మోహన్‌రెడ్డికి వైకాపా నేతలు ఎలాంటి సమాధానం చెబుతారోనని అంతటా చర్చించుకుంటున్న తరుణంలో జిల్లా వైకాపా నేతలు అప్రమత్తమయ్యారు.
మోదీపై జగన్‌ చేసిన విమర్శలను బహిర్గతం చేయాల్సింది మానేసి.. మోహన్‌రెడ్డి పార్టీ ఎందుకు మారారు..? అంటూ చిత్రమైన ప్రశ్నలను సంధించడం మొదలు పెట్టారు.. మోహన్‌రెడ్డి అవినీతిని త్వరలోనే బయటపెడతామంటూ పొంతన లేని కౌంటర్‌ ఇచ్చారు. వ్యాధి ఒకటైతే మంది మరోటి ఇచ్చినట్టుగా వైకాపా నేతల వ్యవహారం ఉందని టీడీపీ నేతలు ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. మోహన్‌రెడ్డి సవాల్‌కు జవాబు చెప్పలేనప్పుడు టీడీపీ నేతలను విమర్శించే నైతికహక్కు వైకాపా అధినేతకు కానీ, ఆ పార్టీ నేతలకు కానీ లేదని జిల్లా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేతల లోపాయికారి ఒప్పందం ఏమిటన్నది ఈ సంఘటన రుజువు చేస్తున్నదని టీడీపీ నాయకులు అంటున్నారు.. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మోహన్‌రెడ్డి సవాల్‌కు జిల్లా వైకాపా నేతలు ఎలాంటి సమాధానం ఇస్తారోనని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*