ఒవైసీ ఎంత పని చేశారో తెలుసా

ఎం.ఐ.ఎం. అధినేత ఒవైసీ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటేయవద్దని ముస్లింలకు పిలుపునిచ్చారు. ఫలితంగా మజ్లిస్ పార్టీ నిర్ణయం దేశ వ్యాప్తంగా హాట్ టాపికైంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి వద్దకే వెళ్లి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మజ్లిస్ పార్టీ అదే పని చేయడంతో జేడీఎస్ పిచ్చ హ్యాపీ మూడ్ లో ఉంది. ముస్లిం ఓటర్లు తమవైపుకు మొగ్గుతారని బలంగా నమ్ముతోంది. ఇక తెలుగు వారు కాంగ్రెస్, బీజేపీలను నమ్మడం లేదు. ఫలితంగా ఆ రెండు పార్టీలకు చుక్కలు కనపడేలా ఉన్నాయి. తమిళులు ఎలాగు బీజేపీని నమ్మడం లేదు. ఇంకోవైపు కాంగ్రెస్ కు ప్రజావ్యతిరేకత ఉంది. అందుకే ఆ రెండు పార్టీలకు బదులు ఇంకో పార్టీ వైపు జనాలు ఆసక్తి చూపడం ఆశ్చర్యంగానే ఉంది. మహారాష్ట్రలోనే తమ పార్టీ అభ్యర్థినిపోటీకి పెట్టి గెలిపించిన చరిత్ర ఎంఐఎంది. ఇప్పుడు కేసీఆర్ తో పాటు.. తాము అంటూ ఆ పార్టీకి మద్దతు పలకడం కన్నడ ఎన్నికల వేడిని మరింతగా పెంచుతోంది. 
కర్నాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వానేనా అనే విధంగా పోటీ ఉంది. కానీ ఇప్పుడు జేడీ(ఎస్‌) కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది.  జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం కుమారస్వామి నిర్వహిస్తున్న సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అందుకే వారికే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ… మద్దతు ప్రకటించడం వ్యూహంలో భాగమేనని చెప్పాలి. 
కర్నాటక ఎన్నికల్లో జేడీ(ఎస్)కు ఎంఐఎం మద్దతు ఇస్తుందని ట్విట్టర్‌లో ప్రకటించిన హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ… అభివృద్ధి జరగాలంటే కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వమే రావాలని పిలుపునిచ్చారు. కన్నడ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉండరని స్పష్టం చేశారు ఒవైసీ. జేడీ(ఎస్)కు మద్దతుగా బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు ఒవైసీ. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు… బెంగళూరు వెళ్లి ఆ పార్టీ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిని కలిసి మాట్లాడి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోసం పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చారనే ప్రచారం సాగింది. 
తెలంగాణలో… సీఎం కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న అసదుద్దీన్ ఒవైసీ మద్దతు ప్రకటించడం వెనుక పెద్ద ప్రయత్నమే జరిగిందట. ముస్లింలకు తాము వ్యతిరేకం కాదని.. హంగ్ ఏర్పడితే మేము కీలకం అవుతామని.. అందుకే మద్దతు ప్రకటించాలని జేడిఎస్ నేతలు ఒవైసీని అడిగినట్లు తెలుస్తోంది. కేసీఆర్ సూచనతోనే వారు మాట్లాడటం, ఒవైసీ ఒకే చెప్పడం చక చకా జరిగిపోయాయట.

1 Comment

  1. This is the game plan of Modi and KCR.That is why Ovaisi entered in Karnataka election seen. Modi,KCR planning to divide Congress vote bank.But people of Karnataka very wise. They know the cheap tricks of BJP.KCR,Ovaisi all are acting in Karnataka with the instuctions of Modi.

Leave a Reply

Your email address will not be published.


*