క‌ర్ణాట‌క‌లో తెలుగోళ్ల‌.. మ‌న మాట వింటారా!

ప్ర‌పంచ క‌ష్ట‌మే.. క‌వి క‌ష్టం.. క‌వి క‌ష్ట‌మే.. ప్ర‌పంచ క‌ష్టం. స‌ర‌దా నానుడి అయినా.. ర‌చ‌యిత‌లు, క‌వులు.. ఈ మ‌ధ్య పాత్రికేయులు కూడా త‌మ క‌ష్టాన్నే స‌మాజం కూడా ప‌డుతుందంటూ వార్త‌లు చెక్కేస్తుంటారు. ఇప్పుడిదే జాఢ్యం.. రాజ‌కీయ నేత‌ల‌కూ సోకింది. పైగా.. తెలుగు రాష్ట్ర నేత‌ల‌కు మ‌రింత ఒంట‌బ‌ట్టింది. ఇందంతా.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల వేళ న‌డుస్తున్న రాజ‌కీయం. నిన్న‌టి వ‌ర‌కూ మోడీసార్‌. అంటూ.. మోక‌రిల్లిన టీడీపీ, టీఆర్ ఎస్ నేత‌లు.. న‌రేంద్ర‌మోదీ అంటే..చిర్రెత్తిపోతున్నారు. ఎవ‌రి లెక్క‌లు వారికే ఉన్నా. త‌ప్పు మాత్రం ఎదుటివారిపై వేలెత్తి చూపుతున్నారు. పోన్లే.. అవ‌న్నీ మ‌న‌కెందుకు అనుకుందామంటే… ఏయ్‌. మీరు తెలుగోళ్లు కాదా! అంటూ ముల్లుక‌ర్ర‌తో పొడిచి మ‌రీ నిద్ర‌లేపుతున్నారు. స‌ర్లే క‌దా! అని ముందుకు న‌డిస్తే. దీక్ష‌లంటూ ఉప‌వాసం ఉండ‌మంటున్నారు.
ఇదంతా .. కేవ‌లం తెలుగువాళ్లకు మాత్ర‌మే సుమా. పాపం.. మ‌న‌మంటే. ఏపీ, తెలంగాణాలో ఉన్నాం కాబ‌ట్టి స‌రిపోయింద‌నుకుందా.. ఇప్పుడు ప‌క్క‌నున్న క‌ర్ణాట‌క తెలుగు ఓట‌ర్ల‌ను కూడా.. మోదీపై అదేనండీ బీజేపీపై రెచ్చ‌గొడుతున్నారు. మీలో తెలుగు ఆత్మ‌గౌర‌వం ఉంటే.. బీజేపీను ఓడించండి.. మ‌రి కాంగ్రెస్‌ను గెలిపిద్దామా అంటే.. ఆనాడు ఎన్‌టీఆర్ యుద్ధం చేసింది కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా క‌దా! మ‌రి ఈ రెండు పార్టీలు గాక ఎవ‌రికేస్తే.. మంచింద‌నే అనుమానంలో తెగ ఇబ్బందిప‌డుతున్నార‌ట‌.. మ‌న తెలుగోళ్లు. ఇవ‌న్నీ కాదులే కానీ.. నోటాకేసి వ్య‌తిరేక‌త వ్యక్తంచేయండి.. ఏదైనా ఉంటే మేమున్నాం అంటూ భ‌రోసా ఇస్తున్నారు.
గ‌తంలో టీడీపీ కూడా స‌మైఖ్య‌సైన్యం ఏర్పాటుచేసి సీమాంధ్రుల‌కు ర‌క్ష‌ణగా ఉంటామంటూ చెప్పిన మాట‌లే ఇప్పుడు గుర్తొస్తున్నాయి. బెజ‌వాడ నుంచి హైద‌రాబాద్‌కు 300 కి.మీ. అదే.. క‌ర్ణాట‌క‌లో వున్న తెలుగోళ్ల‌కు ఏదైనా అవ‌స‌రం వ‌స్తే.. మ‌నం వెళ్ల‌గ‌ల‌మా! ఇక్క‌డు రప్పించి అవ‌కాశాలు ఇప్పించ‌గ‌ల‌మా.. కాబ‌ట్టి.. తెలుగు వారు ఎక్క‌డున్నా.. వారికి ర‌క్ష‌ణ క‌ల్పించే.. అండ‌గా ఉండే పార్టీను.. నేత‌ల‌ను ఎన్నుకోమ‌ని చెబితే బావుంటుందేమో..  ఒక‌వేళ‌.. రేపు బీజేపీ గెలిస్తే.. క‌ర్ణాట‌క‌లో తెలుగోళ్ల ప‌రిస్థితి ఏమిట‌నేది అక్క‌డున్న మ‌నోళ్ల భ‌యం. అయినా.. ఓటు ఎవ‌రికి వేయాల‌నేది.. ఇంట్లోవాళ్లే విన‌ట్లేదు. అలాంటిది.. తెలుగోడు అయినంత మాత్రాన‌.. ప‌క్క రాష్ట్రంలో బ‌తికేవారు వింటారాంటారా!  స‌ర్లే.. ఇదంతా తెలుగు వారికే ప‌రిమితం అయింద‌నుకుంటే..
ఇప్పుడు అర‌వ సోద‌రులు.. అదేనండీ.. త‌మిళ బ్ర‌ద‌ర్స్ కూడా.. క‌మ‌లాన్ని పాత‌ర వేద్దామంటూ క‌న్న‌డ రాష్ట్రంలో ఉన్న త‌మిళుల‌ను ఎగ‌దోస్తున్నార‌ట‌. రేపు.. గుజ‌రాత్‌, ఎల్లుండి.. మహారాష్ట్ర ప్ర‌జ‌ల్ని.. ఆయా రాష్ట్ర నేత‌లు. ఉసిగొల్పితే.. !

2 Comments

  1. K.C.R feels threatened due to rise of Congress in Telangana. So he went out of his way to work for the defeat of Congress in Karnataka. K.C.R very well knows that if he loses in 2019, it will be the end of the game for him, once and for all. So he became a ‘Bhasmasura’ for Congress which created in the first place.

  2. At the first instant when the proposal for Special status for AP came up TN and Karnataka immediately raised objection that they will not agree to the proposal as in that case, established industries also will move to AP from these states. As per the provisions of Special status act, the proposal has to be agreed to by the Council of states i.e all states of India. When the neibouring states are opposing the proposal them special status remains just a dream. And coming to Telugu people in Karnataka, They have settled in karnataka and spl status to AP will cause loss to Karnataka and they will have more attatchment to the adopted state of karnataka. Political parties are taking people for a ride in this case. AP is comparing itself to NE states, which are hilly areas which are far under developed than states like AP.

Leave a Reply

Your email address will not be published.


*