జ‌గ‌న్ అన్నా… ఇది బ‌లుపా!వాపా!

ఈ సారి ఎలాగైనా.. నెగ్గాలి.. ఇప్పుడు అధికారం రాక‌పోతే.. ఇక అంతే సంగ‌తులు. 2014లో టీడీపీ ప‌రిస్థితి. ప్ర‌స్తుతం వైసీపీలోనూ ఇదే వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. తెదేపా వేసిన దారిలోనే జ‌గ‌న్ వ‌ర్గం న‌డుస్తున్న‌ట్టుంది. అప్ప‌ట్లో చంద్ర‌బాబు కూడా యాత్ర పేరిట కీల‌క జిల్లాలు చుట్టొచ్చారు. ఇప్పుడు ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌తో జ‌గ‌న్ కూడా అదే చేస్తున్నారు. అయితే.. రెండింటికీ పోలిక అనివార్య‌మే అయినా.. ఇద్ద‌రి ప‌ర‌మావ‌ధి ప్ర‌తిప‌క్ష నేత‌లుగా.. అధికారం చేప‌ట్ట‌డ‌మే. ఎందుకంటే.. ప్ర‌జ‌ల ప‌ట్ల అభిమానం.. ప్ర‌జాసేవ సంగ‌తి ఎలా వున్నా పార్టీ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాలంటే.. కొద్దికాలం ప‌వ‌ర్ త‌ప్ప‌నిస‌రి. ప్ర‌జారాజ్యం పార్టీ ఫెయిల్యూర్‌కు.. 1980లో తెలుగుదేశం పార్టీ స‌క్సెస్‌కు అదే కార‌ణం. ఇప్పుడు అదేస‌మ‌స్య వైసీపీను వేధిస్తోంది. ప‌దేళ్లుగా.. పార్టీ కోసం చేతులు కాల్చుకుని.. ఉన్న ఆస్తులు తాక‌ట్టుపెట్టిన నేత‌లు.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఆబ‌గా ఎదురుచూస్తున్నారు. పార్టీ వ‌ర‌కూ అది త‌ప్పా.. ఒప్పా అన్న‌ది వేరే విష‌యం.
అయితే.. ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు ఎదుర‌వుతున్న జ‌న‌నీరాజ‌నం.. జ‌న‌సందోహం.. ఉప్పొంగుతున్న అభిమానం.. 2004లో వైఎస్ కు కూడా లేదంటూ.. పొగ‌డ్త‌ల రాయుళ్లు.. జ‌గ‌న్‌ను బాగానే ఉబ్బేస్తున్నార‌ట‌. అయితే అస‌లు స‌మ‌స్య ఏమిటంటే.. భారీగా వ‌స్తున్న జ‌నం.. రేప‌టి రోజున ఓటేస్తారా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ల‌క్ష‌కోట్ల అవినీతి ముద్ర నుంచి బ‌య‌ట‌ప‌డేస్తారా అనేది జ‌గ‌న్ శిబిరంలో ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌. పోనీ.. ప‌ల్లెల్లో జ‌నం.. వైఎస్ పై అభిమానం.. టీడీపీపై వ్య‌తిరేక‌త‌తో వ‌చ్చార‌నుకోవ‌చ్చు. కానీ.. ప‌ట్ట‌ణాల్లో కూడా పోటెత్తుతున్న జ‌నం.. స్వ‌చ్ఛందంగా వ‌స్తున్నారా.. లేక‌.. లోక‌ల్ లీడ‌ర్లు.. అధినేత టార్చ‌ర్ భ‌రించ‌లేక‌.. లారీల్లో జ‌నాన్ని త‌ర‌లిస్తున్నారా అనే సందేహం కూడా ఉంది. వాస్తవానికి జ‌నం త‌ర‌లింపు ఇప్పుడు కొత్తేం కాదు. దాదాపు అన్ని పార్టీల‌దీ ఇదే దారి. అయితే ఎన్నిక‌ల వేళ‌.. విప‌క్షంలో ఉన్న‌పుడు.. జ‌న స‌మీక‌ర‌ణ పార్టీ బ‌లాబ‌లాల‌ను గుర్తించ‌టంలో అంచ‌నాల‌ను దెబ్బ‌తీస్తుంది.
జ‌నాన్ని చూసి.. ఓట్లుగా భావించి ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఓట‌మి పాలైన వారూ ఉన్నారు. గ‌తంలో టీడీపీ, ప్ర‌జారాజ్యం..ఇలాగే నిండా మునిగిన సంద‌ర్భాలూలేక‌పోలేదు. ఇప్పుడ‌దే దారిలో వైసీపీ ప‌య‌నిస్తుందా అనే సందేహం కూడా వైసీపీ శ్రేణుల నుంచే వ్య‌క్త‌మ‌వుతోంది. . కొంద‌రైతే.. అన్నా.. ఇదంతా మ‌న బ‌ల‌మా.. లేక‌.. వాపా అంటూ..అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నార‌ట‌. పోన్లేరా.. ఇప్ప‌టికిదే బ‌లం అనుకుందాం అనుకుంటూ స‌ర్దుకుంటున్నార‌ట కూడా..!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*