కాంగ్రెస్‌ సీనియ‌ర్‌లు ద‌ద్ద‌మ్మ‌ల‌ట‌! వార్డులో  కూడా గెల‌వ‌లేర‌ట‌!!

తెలంగాణ కాంగ్రెస్‌లో అయోమ‌యం. వ‌ర్గాలు.. త‌గాదాలు.. అంత‌ర్గ‌తంగా కుమ్ములాట‌లు.. ఇవ‌న్నీ గాంధీభ‌వ‌న్ గ‌డ‌ప దాటాయి. పోస్ట‌ర్లు వేసి ప‌రువు తీసేంత స్థాయికి దిగ‌జారాయి. అంద‌రూ శాకాహారులే.. కానీ రొయ్య‌ల‌మూట మాయ‌మైంద‌న్న‌ట్లుగా.. హ‌స్తం ప‌దేళ్ల అధికారాన్ని వాడుకున్నారు. ఇప్పుడు ఎవ‌రికి వారు.. సొంత వ్యాప‌కాల్లో మునిగితేలుతున్నారు. అందుకే.. ధ‌ర్నా చేద్దామంటే ప‌ట్టుమ‌ని ప‌దిమంది కూడా చేర‌ట్లేదు. ఎన్నిక‌ల్లో పోటీప‌డితే డిపాజిట్లు కూడా రాని ప‌రిస్థితి. ఇది ఎక్క‌డో కాదు.. తెలుగు రాష్ట్ర ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌లో అస్త‌వ్య‌స్తంగా మారిన హ‌స్తం దుస్థితి. అందుకే క‌డుపు ర‌గిలిన కాంగ్రెస్ వీరాభిమానులు.. క‌ర‌ప‌త్రాలు ముద్రించి మ‌రీపంపిణీ చేస్తున్నారు. పోనీ అదేమైనా.. పార్టీ త‌ర‌పున ప్ర‌చార‌మా అంటే అదీ కాదు.. ఇన్నాళ్లు.. కాంగ్రెస్‌లో ప‌ద‌వులు అనుభ‌వించి.. ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో పార్టీను గాలికొదిలేసిన నేత‌లే కావ‌టం విశేషం. వారిలో ముందువ‌రుస‌లో మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి, వి.హనుమంతురావు, ముఖేష్‌గౌడ్‌, పి.విష్ణువ‌ర్ద‌న్‌రెడ్డి.. అంద‌రూ మ‌హామ‌హులే.. వీళ్లంద‌రికీ స్వ‌యంగా వార్డులో కూడా గెలిచే స్థాయి లేదంటూ  కార్య‌కర్త‌లు ఘాటుగానే విమ‌ర్శించారు.
పీజేఆర్ త‌న‌యుడిగా రాజకీయాల్లోకి వ‌చ్చిన విష్ణు పీజేఆర్ త‌న‌యుడిగా ప్ర‌జ‌లు ఆశించినంత రాణించ‌లేక‌పోయాడు. పైగా.. అర్ధ‌రాత్రి త‌ల‌పుత‌ట్టినా స్పందించే తండ్రి వ్య‌క్తిత్వాన్ని పుణికిపుచ్చుకోలేక‌పోయాడు. మ‌ర్రి తన‌యుడు శ‌శిధ‌ర్‌రెడ్డి కూడా.. క‌నీసం గ‌ట్టిగా స‌ర్కార్‌ను నిల‌దీసే ప్ర‌య‌త్నం చేయ‌లేక‌పోతున్నార‌ట‌. ఇక వీహెచ్‌ను ఏకిపారేశారు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా నియోజ‌క‌వ‌ర్గానికీ పైగా ఖ‌ర్చు చేయ‌లేద‌న్నారు. పైగా జ‌నం త‌నను జోక‌ర్‌గా చూస్తున్నారంటూ ఎద్దేవా కూడా చేశారు. ముఖేష్‌గౌడ్ నాలుగేళ్ల నుంచి గాంధీభ‌వ‌న్ ముఖ‌మే చూడ‌లేదు. పైగా ఇటీవ‌ల ఆయ‌న కొడుకు విక్రంగౌడ్ కాల్పుల వ్య‌వ‌హారంతో  బ‌య‌ట‌కు రాలేక ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఫిలింన‌గ‌ర్ క్ల‌బ్‌లో పేకాట‌కే వెచ్చిస్తున్నాడ‌ట‌.  దానం నాగేంద‌ర్‌, విన‌య్‌కుమార్ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న‌ట్లుగా. పార్టీను దెబ్బ‌తీస్తున్నారంటూ జంట న‌గ‌రాల కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల మ‌నోవేద‌న‌గా క‌ర‌ప‌త్రాలు ముద్రించి భారీగా పంపిణీ చేస్తున్నారు.
ఇది హ‌స్తానికి ఎంత న్యాయంచేస్తుందో తెలియ‌దు కానీ.. గులాబీ పార్టీకు మాత్రం.. ఇదిగో.. కాంగ్రెస్ నేత‌ల గురించి ఆ పార్టీ వాళ్లే చెబ‌తున్నారంటూ ఓటురాజ‌కీయం చేసే అవ‌కాశాలూ లేక‌పోలేదు. అయితే పార్టీ సీనియ‌ర్లు మాత్రం.. ఇదంతా అధికార పార్టీ కుట్ర అంటూ.. టీఆర్ ఎస్ మీద‌కు నెట్టేసే ప్ర‌య‌త్నం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*