కాంగ్రెస్ ఖజానాకు కన్నం వేస్తే… మోడీ జేబులు కొట్టేశాడు !

ఇండియా చరిత్రలోనే ఇది అతి పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ ! 
కాంగ్రెస్ ఖజానాకి కన్నం వేసిందేమో ! కుంభకోణాలు చేసిందేమో… ! కేటాయింపుల్ని వాటాల కింద పంచుకుందేమో… ! మరి మోడీ ఏం చేశాడు.. ?సగటు మనిషి జేబులో చేయి పెట్టేశాడు. జేబు కొట్టేశాడు. రూపాయి దాచుకుంటే దోచుకుంటా అంటున్నాడు. ఖర్చు పెట్టబోతే రేట్లు కరుస్తున్నాయ్. మధ్య తరగతికి భయాన్ని బహుమతిగా ఇచ్చాడు నాలుగేళ్ల మోడీ ! ఇది ఇండియా ఇప్పటి వరకూ ఊహించని దెబ్బ. సగటు మనిషి వెన్ను విరుస్తున్న ఆర్థిక అరాచకత్వం.

కాంగ్రెస్ హయాంలో వ్యవస్థ దెబ్బతింటే… మోడీ వచ్చాక మిడిల్ క్లాస్ పాతాళానికి జారిపోయింది. బ్యాంకు సగటు మనిషికి భరోసా ఇంతకాలం. మోడీ వచ్చాక ఆ భరోసా మీద కొట్టాడు. పెద్ద నోట్ రద్దు చేశాడు. ఎటీఎంని డబ్బాగా మార్చేశాడు. డబ్బు వేసుకుందామంటే లక్షా తొంభై నిబంధనలు. తీసుకుందామంటే సొమ్ము అందుబాటులో లేదు. దాచుకుందామంటే బంగారానికి లెక్కలు కట్టాలి. పోనీ చూసీ చూడనట్టు పోదామంటే ఏ బ్యాంకు ఎప్పుడు మునుగుతుందో తెలియడం లేదు. మూడ్రోజుల వ్యవధిలో బైటపడిన 16 వేల కోట్ల కుంభకోణాలు మోడీ అనుభవరాహిత్యాన్ని, ఆలోచన లేని తనాన్ని దేశానికి చూపించాయ్. లూటీ చేసేవాడు చేసుకుపోతుంటే… సగటు మనిషిని మాత్రం పిండేసి రసం తీయడానికి పనికొస్తున్నాయ్ మోడీ ఆలోచనలు, విధానాలు అనే ఫీలింగే ఇప్పుడు కుదిపేస్తోంది. ఒళ్లు మండేట్టు చేస్తోంది. కాంగ్రెస్ కాలంలో కుంభకోణం జరిగినా ఆ ప్రభావం వ్యవస్థ మీదో ఖజానా మీదో ఉండేది. కానీ మోడీ నిర్వాకాలు నేరుగా మన జేబు వరకూ, ఆ మాటకొస్తే జేబును దాటి జీవితం వరకూ వచ్చేశాయ్.అందుకే అంటున్నది ఇది దేశంలోనే ఇప్పటి వరకూ చూడని అతి పెద్ద ఫెయిల్యూర్ అని.

అవును. ఎవరు సంపాదించిన రూపాయ్ వాళ్లు ఖర్చుపెట్టుకునే స్వేచ్ఛ లేని దేశంగా అవతరించింది ఇండియా.మోడీ నిర్వాకంతో ఇపుడు ఏం  చేస్తే ఏ పన్ను పడుతుందో తెలియదు. ఆఖరికి వేయించిన శనగ పప్పు నములుదామన్నా మోడీనే మనల్ని నమిలేస్తున్నాడన్న ఫీలింగ్ వస్తోంది. కొత్త పన్ను దెబ్బకి. కొనుక్కున్న బంగారం నుంచి పెట్టుబడి పెట్టుకునే స్టాక్ వరకూ ఇప్పుడేదీ మిడిల్ క్లాస్ నిబ్బరంతో ఉండలేకపోతోంది. మురిపెంగా దాచుకునే సొమ్ము ముట్టడిలో ఉండిపోతోంది.

ఇంట్లో దాచుకుందామంటే సేఫ్టీ లేదు. బ్యాంకుల్లో వేసుకునే పరిస్థితీ లేదు. ఇప్పుడు అన్నిటికీ మించి బ్యాంకులకే దిక్కూ దివాణం లేదు.
అదిగో అక్కడ అన్యాయం జరిగింది… అంతరిక్షంలో బ్యాండ్ విడ్త్ ని అడ్డగోలుగా అమ్మేసి లక్షల కోట్లు కొట్టేశారని ఆకాశంవైపు చూపిస్తూ అధికారంలోకి వచ్చిన మనిషి… సగటు మనిషి జీవితం మీద కొట్టేశాడు. నమ్మకాన్ని వమ్ము చేశాడు.

నాలుగేళ్లలో ఒక్క తప్పు అయినా చేశానా అని ఈసారి అడిగితే… మోడీకి ఇదే చెప్పబోతోంది ఇండియా…నువ్ జీవితాల్ని గుండం చేసేశావ్… అని !

1 Comment

  1. It’s not a failure story, Modi’s cheating story to Indian public. Whole India believed and respected him with PM seat in 2014.People did not think he is a lair and cheater.All middle class, poor people suffering a lot.Now all people realizing how they cheated by this cunning chaywala. In 2019 all people send him from PM post to chaywala post.It’s sure.

Leave a Reply

Your email address will not be published.


*