కత్తి పై సునీత (సుత్తి)ని ప్రయోగించారా…

పవన్ కల్యాణ్ పరువు తీస్తున్నాడు కత్తి మహేష్. అసలు రాజకీయాలకు పనికి రాడని చెప్పాడు. అసలు నైతికంగాను అతను విలువ లేని వాడని అన్నాడు. సోషల్ మీడియా వేదికగా ఆటాడుకుంటున్నాడు. అందుకే అతని ఆగడాలకు పుల్ స్టాప్ పెట్టాలనుకుంది జనసేన టీమ్. ఇందుకు సరైన వేదిక కోసం ఎదురు చూసింది. ఇంతలోనే ఆటలోకి నటి సునీత వచ్చింది. కత్తి మహేష్ తనను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించారని..రూములోకి తీసుకెళ్లి ఏదో చేయబోయారని ఆరోపించింది. ఇది జరిగి చాలా రోజులైంది. అయినా సరే ఆమె ఓ టీవీ చానల్ లో ఇలా ఆరోపించడంతో విషయం రచ్చ కెక్కింది. ఇది కావాలని ఆమెతో ఇలా చేయించారనే ప్రచారం జరిగింది. నిజమైతే చర్యలు తీసుకోండి. అంతే గానీ ఇలా టీవీల ముందు కూర్చుని ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని కత్తి మహేష్ డిమాండ్ చేశారు. ఫలితంగా సునీతకు ఏం చేయాలో అర్థం కాలేదు. పైగా జనసేన సోషల్ మీడియా ఆమె మాటలను ప్రచారం చేయడంతో అనుమానాలు మరింతగా బలపడ్డాయి
నిజమైతే నిరూపించాలన్న కత్తి
తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై కత్తి మహేష్ ఘాటుగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపికైంది. ఈ ఆరోపణల వెనుక కుట్ర దాగి ఉందని.. దీనికి కారకులైన వారిపై పరువు నష్టం దావా వేస్తానని కత్తి మహేష్ అంటున్నారు. ఆయన ఏమంటున్నారో చూడండి…‘‘స్త్రీలని నేను అపురూపంగా చూసుకుంటాను. గౌరవంగా, స్నేహపూర్వకంగా వాళ్ళతో మెలుగుతాను. ప్రేమిస్తే, ప్రేమని వ్యక్తపరుస్తాను. కాంక్షిస్తే, అంతే గౌరవంగా చెప్తాను. కాదంటే వాళ్ళ అభిప్రాయాన్ని సగౌరవంగా అంగీకరిస్తాను. ఆ తరువాత ఎప్పటికీ ఆ ప్రస్తావన రాకుండా నా స్నేహాన్ని గౌరవంగా కొనసాగిస్తాను. నాకు నైతికత వ్యక్తిగతం. అదే నేను పాటించే విలువ.
దావా వేయనున్న కత్తి
నా మీద వచ్చిన ఆరోపణ ఒక కుట్రలో భాగం. ప్రస్తుతం జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ చర్చలకి, ఈ ఘటనకి అసలు సంబంధం లేదు. లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. అది నిరూపించుకోవడంలో భాగంగా ఆ స్త్రీ మీద నేను 50 లక్షలకి పరువునష్టం దావా వేస్తున్నాను. నా జీవితంలో ఉన్న స్త్రీలు, నేనంటే ఏమిటో తెలిసిన మిత్రులు, వ్యక్తులకు నేను ప్రత్యేకంగా నా వ్యక్తిత్వం గురించి చెప్పనక్కరలేదు. కానీ, ఈ సందర్భంలో ఒక పబ్లిక్ స్టేట్‌మెంట్ అవసరం అనిపించి ఇది రాస్తున్నా’’ అని అందులో ప్రస్తావించారు. 
సునీత ఏం చెప్పారంటే…
కత్తి మహేష్ తనను వేధించారు. గదిలోకి తీసుకెళ్లి.. డోర్ పెట్టి.. బలవంతం చేశారు. ఆ తర్వాత రూ.500 ఇచ్చి పంపించారనేది ఆమె చేసిన ఆరోపణ. అంటే రూ.500 ఇస్తే వెళ్లింది. ఇన్నాళ్లు ఎందుకు ఆగిందో తెలియదు. ఇప్పుడు ఎవరి ప్రొత్సాహంతో అలా చెప్పిందో అర్థం కాని పరిస్థితి. పరువు నష్టం దావా వేస్తామని చెప్పడంతో ఆమె ఇరుక్కుపోయింది. వాస్తవం ఏంటో తెలిసే లోపు అబద్దం ఆరు సముద్రాలు దాటింది. ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగాలా లేక అబద్దాన్ని నిజమని ఒప్పించాలో అర్థం కాని పరిస్థితి అయింది సునీతకు. తాను సాక్ష్యాధారాలు కూడా చూపిస్తానని సునీత మొదట్లో చెప్పింగది. కానీ ఆమె వెనుక కొణిదెల ప్రొడక్షన్స్ ఉందని ఆరోపించారు కత్తి మహేష్. ఆ సంస్థపై కూడా పరువు నష్టం దావా వేస్తానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మరోవైపు సదరు చానల్ తనను బెదిరిస్తోందని ఓ వీడియోను పోస్ట్ చేసింది సునీత. దీనిని జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ అయిన శతఘ్ని మిసైల్ తన ట్విటర్‌లో షేర్ చేసింది. సైబరాబాద్ సీపీ, సైబరాబాద్ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ డీజీపీకి, మంత్రి కేటీఆర్‌కు, ఎడిటర్స్ గిల్డ్‌కు, స్మృతి ఇరానీకి ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఓ నటి మాట్లాడే హక్కును ఓ తెలుగు ఛానల్ కాల రాస్తోందని సునీతను కాపాడాలని జనసేన సోషల్ మీడియా వింగ్ కోరింది. ఫలితంగా అందరికీ ఆ వీడియో పై సందేహాలు ముసురుకున్నాయి. 
 
ఇరుక్కున్న సునీత
మా పేరెంట్స్ కూడా నాకు ఇప్పుడు సపోర్ట్ లేరు. నేనసలు ఆ ఛానల్‌కు వెళ్లలేదు. వాళ్లే నన్ను పిలిపించారు. ఉన్నది ఉన్నట్టు చెప్పాను నేను. లేనిదేమీ చెప్పలేదు. క్యాస్టింగ్ కౌచ్ గురించి అడిగారు. నిజం చెప్పాను. మహేష్ కత్తి గురించి కూడా చెప్పాను. మహేష్ కత్తికి ఆ ఛానల్‌ ఇంత సపోర్ట్ ఇస్తుందని నిజంగా నాకు తెలియదు. వాళ్లు నన్నిప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఆ ఛానల్‌కు నేను రాను. నేను లీగల్‌గా వెళతాను అని చెప్పాను. మహేష్ కత్తి నన్ను రూ.50లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. కేసు పెడతానని చెప్పి బెదిరిస్తున్నాడని ఆ వీడియోలో వాపోయింది. ప్రభుత్వం దీని పై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే వీలుంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*