మాజీ మంత్రి సర్వేను తిట్టిన కూకట్ పల్లి ఎమ్మెల్యే

తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మధ్య వివాదం రగిలింది. హైదరాబాద్ కూకట్ పల్లిలోని వై జంక్షన్ లో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఈ రగడ రేగింది. సర్వే సత్యనారాయణను స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తిట్టారు. నువ్వు అంటూ ఏకవచనంతో సంబోధించారు. నువ్వు ఎందుకు కలెక్టర్ ను తిట్టినవ్ అని సర్వేపై మాధవరం ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదం రేపింది. దళితుడైన వ్యక్తి అనే గౌరవంతో సభకు ఆహ్వానిస్తే కలెక్టర్లను మిగతా వారిని తిడతావా..నువ్వు అంటూ ఎమ్మెల్యే నిప్పులు చెరగడం వివాదాన్ని పెంచింది. ఫలితంగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు తోపులాడుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. 
సర్వే కాంగ్రెస్ నేత. మాధవరం టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన నేత. ఇద్దరు ఎవరికి వారే తమ నియోజకవర్గంలో పట్టు కోసం పావులు కదుపుతున్నారు. మల్కాజ్ గిరి పార్లమెంటు పరిధిలోకి కూకట్ పల్లి అసెంబ్లీ వస్తోంది. అందుకే కూకట్ పల్లిలో జరిగే పలు కార్యక్రమాలకు పార్టీల కతీతంగా సర్వేను పిలుస్తుంటారు. సర్వే మరింత స్ట్రాంగ్ అయితే తనకు ఇబ్బంది అని భావించారు మాధవరం. అంతే దూకుడుగా ఆయన పై నిప్పులు చెరిగారు. దీంతో విస్తుబోవడం సర్వే సత్యనారాయణ వంతు అయింది. కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అందుకే వెనుకా ముందు ఆలోచించకుండా సర్వే పై మండిపడ్డారని తెలుస్తోంది. 
అంతకు ముందు కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డిపై నిప్పులు చెరిగారు. దీంతో మనస్థాపం చెందిన కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. తనను అవమానించేలా మాట్లాడారని టిఆర్ఎస్ నేతలకు చెప్పారు. అంతే పోలీసులు జోక్యం చేసుకుని సర్వేను అక్కడి నుంచి పంపించేశారు. ఆ సంగతి తెలుసుకున్న మాధవరం కృష్ణారావు సర్వేను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మంటలు రేపుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల సమయంలో ఇక ఎలా ఉంటుందో చూడాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*