సంకటంలో జేజేమ్మ యాత్ర 

పాదయాత్రలు ఇప్పుడు నేతలకు అవసరం. ఎవరు ఎక్కువ రోజులు పాదయాత్ర చేస్తే వారికి జనం ఓటేస్తారనే ప్రచారం సాగుతోంది. అందుకే ఎవరికి వారే యాత్రలు చేస్తున్నారు. గతంలో పెద్ద నేతలు. బాగా పలుకుపడి ఉన్న వారే యాత్ర చేసేవాళ్లు. అందుకే ఒక పెద్ద లక్ష్యం ఉండేది. కానీ ఇప్పుడు యాత్రలు తమ నియోజకవర్గం, తమ అవసరాల కోసమే ఎక్కువగా చేస్తున్నారు. ఏపీలో వైఎస్, చంద్రబాబు లు యాత్రలు చేసారు. అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు జగన్ అలానే పాదయాత్ర చేస్తున్నారు. అధికారంలోకి వస్తారా లేరా అనేది ఎన్నికల్లో తెలుస్తోంది. 
ఇప్పుడు ఏపీలోనే కాదు..తెలంగాణకు ఆ సెగ తాకింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా పాదయాత్రలకు సిద్ధం అవుతున్నారు. అధిష్టానం అనుమతినివ్వక ముందే నడక మార్గానికి రూట్ మ్యాప్ సిద్దం చేసుకుంటున్నారు. ఆ పార్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి , మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్  పాదయాత్రలకు ఢిల్లీ పెద్దలు అనుమతిచ్చారు. త్వరలోనే వారు యాత్రలు చేసేందుకు సిద్దమయ్యారు. నేనేం తక్కువ అనుకున్నారు గద్వాల జేజేమ్మ. అందుకే మాజీ మంత్రి డికే అరుణ పాదయాత్రకు ముహూర్తం సిద్ధం చేసుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాచైతన్య బస్సుయాత్ర చేస్తున్నారు. రెండువిడతలు పూర్తి చేసుకొని మూడో విడత కు ఉత్తమ్ సిద్ధమవుతున్నాడు. 
ఇలాంటి సమయంలోనే మాజీ మంత్రి గద్వాల జేజమ్మ తాను కూడా  జూన్‌లో పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించింది. అలంపూర్ జోగులాంబ నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేయడానికి అనుమతినివ్వాలని అధిష్టానంతో పాటు పీసీసీని కోరింది. మహిళా నేతగా రాష్ట్ర ప్రజలందరి దగ్గర తనకు ప్రత్యేక గుర్తింపు ఉందనిచెబుతోంది. ఆ పార్టీ ఇంచార్జ్ కుంతియాతో జరిగిన భేటిలోఈ సమాచారం చెప్పినట్లు తెలుస్తోంది. తాను పాదయాత్ర చేయడం ద్వారా పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్ధైర్యంతో పాటు మహిళల మద్దతు లభిస్తుందని అరుణ భావన.
అరుణ పాదయాత్రపై ఇప్పటి వరకు ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయలేదు. ముగ్గురు నేతలకు అనుమతిచ్చిన నేపధ్యంలో అరుణ విషయంలో ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠను పెంచుతోంది. పులిని చూసిన నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదేనంటున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. తొలిగా కాంగ్రెస్ పెద్దలు అడిగినప్పుడు ఆమె స్పందించలేదు. కానీ ఇప్పుడు తాను యాత్ర చేస్తాను. అనుమతించాలని కోరడం ఆసక్తిగా మారింది. దీనికి బదులుగా నేతలంతా ఉమ్మడి పాదయాత్ర చేయాలని కొందరు మరో ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డితో పాటు..మరికొంత మంది జేజేమ్మ యాత్రకు అనుమతి రాకుండా అడ్డు పడే వీలుందటున్నారు. నాగం జనార్దన రెడ్డి రాకను ఆమె గట్టిగా వ్యతిరేకిస్తోంది. అందుకే ఇప్పుడు డికే అరుణ యాత్రను అడ్డుకునే పని చేస్తుందనే చర్చ సాగుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*