సింగపూర్ లోను బాబుది అదే మాట

ఏపీకి న్యాయం చేయాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేకపోతే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు సిఎం చంద్రబాబు. హోదా ఇవ్వక పోగా..విభజన హామీలను అమలు చేయడం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. సింగపూర్ కు వెళ్లిన చంద్రబాబు అక్కడ కూడ ఇదే మాట చెప్పారు. ఫలితంగా ఇతర దేశాల్లోను ఏపీ అంశం హాట్ టాపికైంది. ప్రధాని మోడీ కొన్ని రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా అడ్డుకున్నారనే చర్చ సాగుతోంది. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తన సొంత రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు కేటాయించడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. 
కేంద్ర ప్రభుత్వం నవ్యాంధ్ర అభివృద్ధికి అడ్డుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. సింగపూర్‌ లో తెలుగుదేశం ఫోరం సభ్యులతో సమావేశమైన చంద్రబాబు నిప్పులు చెరిగారు. ‘‘కేంద్రం పైసా ఇవ్వకున్నా… మన కష్టంతో ముందుకెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని చూసి వాళ్లు అసూయ, ఈర్ష్యకు గురయ్యారు. అయితే, కేంద్రం వైఖరి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు.  పార్లమెంటు సమావేశాలు నడవనీయుకుండా తమిళనాడు ఎంపీలతో ఆందోళన చేయించింది బీజేపీనే అన్న తెలిసిందే. అదే విషయాన్ని సింగపూర్ టీడీపీ నేతలకు చెప్పారు బాబు. 
మోదీ గుజరాత్‌లో ఒక విగ్రహం నెలకొల్పడానికి రూ.2500 కోట్లు ఖర్చు పెట్టారు. అదే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి మాత్రం 1500 కోట్లు ఇచ్చారు. మరో రూ.1000 కోట్లు గుంటూరు, విజయవాడ డ్రైనైజ్ ల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఏపీని ఆదుకోవడంలో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. అదే విషయాన్ని అక్కడి వారికి అర్థం అయ్యేలా చెప్పారు చంద్రబాబు. తెలుగు వారి రాజధానిని సొంత డబ్బులతో నిర్మించే ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు. పాతికేళ్ల కిందట సింగపూర్‌కు వచ్చినప్పుడు అంతా తమిళులే ఉండేవారు. ఇప్పుడు అంతా తెలుగువారు కనపడుతున్నారని చంద్రబాబు అన్నారు. 
ఏపీ ఎన్నార్టీ అందుకే…
విదేశాల్లో ఉన్న తెలుగు వారికి సాయం అందించేందుకు ఏపీ ఎన్‌ఆర్టీని స్థాపించామని తెలిపారు. ఎన్‌ఆర్టీ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే తాము ఏపీ ఎన్నార్టీలో చేరినట్లు కొందరు సభ్యులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. రానున్న రోజుల్లో ఏపీ ఎన్నార్టీని మరింతగా అభివృద్ధి చేస్తామని…ఎన్నారైలను ఆదుకునేందుకు దీనికి నిధులను మరింతగా కేటాయించినట్లు తెలిపారు చంద్రబాబు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*