విగ్రహంతో అమ‌రావ‌తిని పోల్చి మోడీకి షాకిచ్చిన బాబు

స్నేహితుడిగా ఉన్న‌ప్పుడు కొన్ని త‌ప్పొప్పుల్ని చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం మామూలే. లెక్క‌లు తేడా వ‌చ్చిన త‌ర్వాతే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. తాజాగా బీజేపీ.. టీడీపీ సంబంధాల విష‌యంలో ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. మొన్న‌టివ‌ర‌కూ క‌లిసి ఉన్న వారిని ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారం వారి మ‌ధ్య దూరం పెరిగేలా చేసింది. 
హోదా విష‌యంలో మిత్ర‌ప‌క్షం డిమాండ్ ను మోడీ నో అనేయ‌టం.. ఏపీ ప్ర‌జ‌ల్లో అంత‌కంత‌కూ పెరుగుతున్న హోదా సెంటిమెంట్ ను గుర్తించిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హోదా సాధ‌న‌పై పోరాటం చేయాల‌ని డిసైడ్ అయ్యారు. 
నాలుగేళ్ల స్నేహానికి టాటా చెప్పిన నాటి నుంచి బీజేపీ.. టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం అంత‌కంత‌కూ ముదిరింది. ఏపీకి తామెంతో చేశామ‌ని బీజేపీ నేత‌లు చెప్పుకుంటుంటే.. అలాంటిదేమీ లేద‌ని టీడీపీ నేత‌లు తేల్చి చెబుతున్నారు. ఏపీకి మోడీ స‌ర్కారు ఎంత చేసింద‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ఇలాంటి వేళ‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెప్పుకొచ్చారు.
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం విష‌యంలో మోడీ స‌ర్కారు ఎంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌న్న విష‌యాన్ని చెప్ప‌టంతో పాటు.. అమ‌రావ‌తి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన నిధుల కేటాయింపు విష‌యంలో మోడీ స‌ర్కారు ఎంత దారుణంగా వ్య‌వ‌హ‌రించింద‌న్న విష‌యాన్ని బాబు లెక్క‌ల‌తో స‌హా చెప్పి షాకిచ్చార‌ని చెప్పాలి. ఏపీకి చాలా చేశామ‌న్న మాట‌కు రుజువుగా బీజేపీ నేత‌లు గ‌ణాంకాల్ని చూపించ‌లేక‌పోతుంటే.. అందుకు భిన్నంగా బాబు మాత్రం వివ‌రంగా లెక్క చెప్పేస్తున్నారు.
గుజ‌రాత్ లో స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ విగ్ర‌హాన్ని నెల‌కొల్పేందుకు ప్ర‌ధాని మోడీ రూ.2500 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని.. అదే స‌మ‌యంలో ఏపీ అమ‌రావ‌తి నిర్మాణానికి మాత్రం 1500 కోట్లు మాత్ర‌మే ఇవ్వ‌టం ఎంతవ‌ర‌కు స‌బ‌బు? అని సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. ఒక విగ్ర‌హం కోసం అంత భారీగా ఖ‌ర్చు చేస్తున్న మోడీ.. ఒక రాష్ట్ర రాజ‌ధాని కోసం ముష్టి విదిల్చిన‌ట్లుగా విదిలుస్తున్న వైనంపై బాబు నిప్పులు చెఇగారు. 
విభ‌జ‌న చ‌ట్టంపై నాడు రాజ్య‌స‌భ‌లో గ‌ట్టిగా మాట్లాడార‌ని బీజేపీతో ఎన్నిక‌ల పొత్తు పెట్టుకున్న‌ట్లుగా బాబు చెప్పారు. త‌న ఆశ‌ల్ని ఆడియాశ‌లు చేశార‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అభివృద్ధిని చూసి వారు అసూయ చెందుతున్నార‌న్నారు. ఈ కార‌ణంతోనే ప్ర‌త్యేక హోదా హామీని తుంగ‌లో తొక్కార‌ని మండిప‌డ్డారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం మోకాలు అడ్డు పెట్టిందంటూ ఆరోప‌ణ చేసిన బాబు.. త‌న వాద‌న‌కు త‌గ్గ‌ట్లు ఒక విగ్ర‌హం విష‌యంలో మోడీ స‌ర్కారు ప్ర‌ద‌ర్శించిన దొడ్డ మ‌న‌సు.. ఐదు కోట్ల ఆంధ్రుల విష‌యంలో మాత్రం చూపించ‌లేద‌న్న విష‌యాన్ని లెక్క‌ల సాక్ష్యంతో చెప్పేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 

1 Comment

  1. A great leader succeeds when he selects the right person for the right job and encourages talent. What should one think of a leader who encourages Vijaya Sai reddy and despises visionary leaders.

Leave a Reply

Your email address will not be published.


*