దీక్ష భూమి మీద…ఆహారం ఆకాశంలో 

ప్రధాని నరేంద్ర మోడీ ఒక రోజు దీక్ష పై అనుమానాలు పెరుగుతున్నాయి. టిఫిన్, భోజనాలు చేసి మోడీ దీక్షకు దిగారనే విమర్శలు ముందే వచ్చాయి. అసలు ప్రధానమంత్రి కార్యాలయమే ఈ సంగతి బయట పెట్టింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో టిఫిన్, చైన్నై ఎయిర్ పోర్టులో భోజనం చేశారు మోడీ. దీక్షలో ఉంటూ ఆహారం ఎలా తీసుకుంటారనేది పలువురు ప్రముఖులు అడిగిన ప్రశ్న. ఇందుకు బీజేపీ నుంచి సమాధానం లేదు. ప్రముఖ నటి ,కాంగ్రెస్ నేత ఖుష్భు ఇదే విషయంలో తీవ్ర ఆరోపణ చేశారు. మోడీ విమానంలోనే టిపిన్ ,బోజనం చేశారని, ఆ తర్వాత దీక్షలో పాల్గొన్నారని ఆరోపించారు.
పార్లమెంటు సమావేశాలు సరిగా జరగనందుకు నిరసనగా బీజేపీ దేశ వ్యాప్తంగా నిరసన దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. నిరసనదీక్ష అంటే తినకుండా దీక్ష చేయాలి. కానీ మోడీ దీక్ష మధ్యలోను తినేసి ఆపని చేశారని తెలుస్తోంది. పిఎంవో కార్యాలయమే ఈ సంగతి చెప్పడం ఇప్పుడు కమలనాధులను ఆందోళనకు గురిచేస్తోంది. బయట వ్యక్తులు చెబితే పెద్దగా నమ్మేవారు కాదు. అధికారికంగా మోడీ టిఫెన్ చేశారని చెప్పడంతో దొంగ దీక్ష చేశారనే ప్రచారం సాగుతోంది. 
తమిళనాడు పర్యటనకు మోడీ ప్రత్యేక విమానంలో వచ్చినప్పుడు మధ్యలోనే ఆయన ఆహారం తీసుకున్నారని కుష్బూ అంటున్నారు. తిని దీక్ష చేపట్టిన ప్రధాని ప్రపంచంలో మోడీ ఒక్కరే. తమిళజాతి కావేరీ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై రగిలిపోతోందని ఆమె వ్యాఖ్యానించారు.. అందువల్లే మోదీ రోడ్డుమార్గంలో కాకుండా హెలికాప్టర్‌లో ప్రయాణించారని తిడుతున్నారు. అసలే కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. జేడీఎస్ ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని తెలుగువారికి టీడీపీ చెబుతోంది. కావేరి బోర్డు ఏర్పాటు చేయనందుకు నిరసనగా కర్నాటకలోని తమిళులంతా ఎదురు తిరిగారు. ఫలితంగా అన్ని వైపుల నుంచి బీజేపీకి ఇబ్బంది వస్తోంది. ఇప్పుడు బాగా తిని దీక్షలు చేశారనే ప్రచారం బీజేపీకి మైనస్ అనే చెప్పాలి. 

2 Comments

  1. Modi chesindi deekha aite kadaa ! Aviswasam parliament lo rakunda taanu chesina kutra nu daachenduku kaarchina mosali kaneeru.Donga baabalu chese donga deeksha.

Leave a Reply

Your email address will not be published.


*