కలిసిన బాబాయ్, అబ్బాయ్ లు

తెలుగునాట బాబాయ్. అబ్బాయ్ లు అంటే గుర్తుకు వచ్చే పేర్లు రెండే. బాలయ్య, జూనియర్ ఎన్డీఆర్. బాబాయ్ నటనను చూసి తాను ఎంతో నేర్చుకున్నానని చాలాసార్లు ఎన్టీఆర్ చెప్పారు. కాలం మారింది. ఇప్పుడు బాబాయ్ ఉన్న చోట అబ్బాయ్ ఉండటం లేదు. అబ్బాయ్ వచ్చిన చోటకు బాబాయ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రావడం లేదు. రాజకీయాల్లో బిజీగా ఉన్న బాలయ్య ఇంటికి…హరికృష్ణ ఇంటికి దూరం పెరిగింది. ఇప్పుడు ఆ సంగతి పక్కన పెడితే..అచ్చు అలానే ఉంది మెగా కుటుంబంలోని బాబాయ్, అబ్బాయ్ పరిస్థితి. చిరంజీవి పాల్గొన్న కార్యక్రమంలో పవన్ పాల్గొనడంలేదు. అదే సమయంలో పవన్ హాజరైన పంక్షన్ కు చిరు రావడం లేదు. పైకి ఏం లేకపోయినా చిరంజీవి, పవన్ కల్యాణ్ బహిరంగంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం అరుదని చెప్పాలి. వారిద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ బేధాలే ఇందుకు కారణమంటారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి ఎత్తేయడం పవన్ కల్యాణ్ కు నచ్చలేదు. రాజకీయంగా అన్న చిరంజీవి విధానం తమ్ముడు పవన్ కల్యాణ్ కు ఇష్టం లేదు. అందుకే ఇంటికి దూరంగా ఉంటున్నారు. ఎప్పుడో ఒకసారిగాని అటువైపు వెళ్లడు. 
కలిపిన రంగస్థలం  
రంగస్థలం సినిమా సూపర్ హిట్ అయింది. రికార్డులను కొల్లగొడుతోంది. అందుకే తన బాబాయ్ ఇంటికి వెళదామనుకున్నాడు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్. కానీ అనూహ్యంగా బాబాయ్ అబ్బాయ్ కు ఫోన్ చేసి మరీ ఇంటికి ఆహ్వానించాడు. ఆ తర్వాత సక్సెస్ పంక్షన్ పెడదామనే ఆలోచన వచ్చింది. ఈ వేడుకకు చిరంజీవి, ఆయన సతీమణి, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులెవరు రాలేదు. కేవలం పవన్ కల్యాణ్ 
రామ్ చరణ్ లే హాజరయ్యారు. బాబాయ్ అంటే అబ్బాయ్ కు చాలా అభిమానం. గౌరవం. అందుకే గుంటూరులో నిర్వహించిన ప్రజారాజ్యం సభ తర్వాత పవన్ బాగా మాట్లాడరని కితాబునిచ్చారు రామ్ చరణ్. రాజకీయాలకు తనకు సంబంధం లేకపోయినా చంద్రబాబు, లోకేష్ లను పవన్ కల్యాణ్  విమర్శించిన సంగతి తెలిసిందే. అది బాగా నచ్చిందని చెప్పడం కాస్త విచిత్రంగా ఉన్నా..బాబాయ్ కోసమే ఈ మాటలుచెప్పారు రామ్ చరణ్. 
ఆస్కార్ కు పంపాలట….
రంగస్థలం’ చిత్రాన్ని ఆస్కార్‌ కోసం పంపాలని, లేకపోతే ఈ చిత్రానికి ద్రోహం చేసిన వాళ్లమవుతామని పవన్‌ కల్యాణ్‌ అనడం ఆశ్చర్యమే.  రామ్‌చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ విజయోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఈ మాటలన్నారు. ‘బాహుబలి’కి చిత్రపరిశ్రమ అంతా అండగా నిలబడింది. ఇప్పుడు ‘రంగస్థలం’కి అలా నిలబడాలని సూచించారు పవన్. రంగస్థలం మన తెలుగు నేల కథ. మన మట్టి కథ. రాజకీయాల పరంగా వేరు. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రోత్సహించాలి. నాక్కూడా కొన్ని పాత్రలు చేయాలనిపిస్తుంది. కానీ చేయలేను. పంచెకట్టుకుని సినిమా చేసేంత ధైర్యం నాకు లేదు. అలాంటి పాత్రలో చరణ్‌ కనిపించినందుకు ఆనందంగా ఉందని చరణ్ గురించి చెప్పాడు పవన్. మొత్తంగా బాబాయ్ అబ్బాయ్ లు కలిశారు. బాగానే ఉంది. అక్కడే అన్నయ్యలు చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు కలిస్తే అభిమానులకు మరింత పండుగ అయ్యేది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*