శ్రీరెడ్డి విష‌యంలో మా వెన‌క్కి …

శ్రీరెడ్డి అర్ధ‌న‌గ్న‌ ప్ర‌ద‌ర్శ‌న‌తో సినీ రంగంలో ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. ఆమె వ్య‌వ‌హారంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ నాయ‌కులు అర్జంటుగా ప్రెస్‌మీట్ పెట్టేసి శ్రీరెడ్డి సినిమాలో న‌టించ‌కుండా నిషేధిస్తున్న‌ట్టు ప్ర‌కటించారు. ప‌నిలో ప‌నిగా శ్రీరెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయిన‌ప్ప‌టికి శ్రీరెడ్డి మాత్రం త‌న‌ పోరాటం ఆప‌డం లేదు. ఉస్మానియా విద్యార్ధిసంఘాల మ‌ద్ద‌తు కూడ‌బెట్టుకుంది. అగ్ర‌నిర్మాత కుమారుడితో ఉన్న‌ చిత్రాలు విడుద‌ల‌ చేసింది. అంతేకాదు మ‌రికొంతమందితో ఉన్న చిత్రాల‌ను బ‌హిర్గ‌తం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆమెకు కొంత మంది తెర వెనుక నుంచి పూర్తి మ‌ద్ద‌తు ఇచ్చారు. కుమారుడి చిత్రాలు బ‌య‌ట‌కు రావ‌డంతో అగ్ర‌నిర్మాత కుటుంబం ఒక్క‌సారిగా ఖంగు తిన్న‌ది. వెంట‌నే నిర్మాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ స‌భ్యుల‌ను పిలిచి శ్రీరెడ్డి వివాదానికి తెర‌దించాల‌ని కోరిన‌ట్టు స‌మాచారం.  తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఫిలిం ఛాంబ‌ర్, డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్, ‘మా’ అసోసియేష‌న్ పెద్ద‌లు వ‌ర్ధ‌మాన న‌టి శ్రీరెడ్డి విష‌యాన్ని  పున: ప‌రిశీలించాల‌ని కోరారు. ఈ  మేర‌కు మా అసోసియేష‌న్ అధ్య‌క్షుడు శివాజీరాజా శ్రీరెడ్డి తో `మా` స‌భ్యులు యధాత‌ధంగా ప‌నిచేయ‌వ‌చ్చని ప్ర‌క‌టించారు. అలాగే `మా` లో స‌భ్య‌త్వ విష‌య‌మై క‌మిటీ స‌భ్యులు, మెంబ‌ర్లంతా స‌మావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. కాని శ్రీరెడ్డి మాత్రం సినీ ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌క్షాళ‌న చేసేదాకా త‌న నిర‌స‌న ఆగ‌దంటూ ప్ర‌క‌టించింది. శ్రీరెడ్డి వ్య‌వ‌హారం ఇంకా ఎన్ని మ‌లుపులు తిర‌గ‌బోతుందో చూడాలి. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*