క్యాస్టింగ్ కౌచ్‌పై కృష్ణ‌వంశీ ఆనాడే చెప్పేశాడు!

తెలుగు సినీ ఇండ‌స్ట్రీను ఊపేస్తున్న ప‌దం క్యాస్టింగ్ కౌచ్‌.. అచ్చ తెలుగులో వేషం కావాలంటే.. ఫ్రీగా మూవ‌వ్వాలి. ఎవ‌ర్నీ నొప్పించ‌కూడ‌దు. ఇదీ హీరోయిన్ల నుంచి న‌టి వ‌ర‌కూ స‌ర్వ‌సాధార‌ణ‌మంటూ శ్రీరెడ్డి అనే చిన్న న‌టి పేల్చిన బాంబు. మ‌రి ఆమెతో స‌న్నిహితంగా మెలిగిన వారంతా మేనేజ‌ర్లో.. ఆఫీస్‌బాయ్‌లో.. మేక‌ప్ మ్యాన్‌లో అయితే గొడ‌వే లేదు. కానీ.. అంద‌రూ వెండితెర వెనుక మ‌హానుభావులే. సినీ తెర‌కు మూల‌స్తంభాలే. ద‌గ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి నిన్న‌గాక మొన్నొచ్చిన నానీ వ‌ర‌కూ అంద‌రూ ఇందులో భాగం అవ్వ‌ట‌మే ఇందుకు కార‌ణం. శ్రీరెడ్డి అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న వెనుక వాస్త‌వాలు.. బ్లాక్ మెయిల్ ఏమైనా.. ఆమె మాత్రం.. తెలుగు సినిమా బట్ట‌లూడ‌దీసి న‌డిబ‌జార్లో పెట్టేసింది. చివ‌ర‌కు  ప‌వ‌న్ అన్న‌య్యా అంటూ ప‌వ‌ర్‌స్టార్‌.. చ‌ర‌ణ్ హీరోగా వీళ్ల‌ను ఏం చేయ‌వా అంటూ రంగ‌స్థ‌ల హీరోను కూడా లాగేశారు.
రేపో.. మాపో.. ఇంకొంద‌రు పేర్లు.. బ‌య‌ట ప‌డాల్సిందేనేమో. ఇంత‌మాత్రాన‌.. ఇదేమైనా ఇప్పుడే పుట్టిందా అంటే.. అబ్బే అలాంటిదేమీ లేదు. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ నుంచి స్టార్‌హీరోల తంతు ఇదేనంటూ ఓ అగ్ర‌న‌టి.. పాపం ఇప్పుడామె మ‌స‌లామె అయిందిలెండీ.. తానే చెప్పింది. ఇద్ద‌రు అగ్ర‌హీరోల ఇష్టానికి త‌గిన‌ట్టుగా న‌డుచుకోకపోవ‌టం వ‌ల్ల వేషాలు రాలేదంటూ ఓ ఇంటర్వ్యూలో ప‌దేళ్ల క్రిత‌మే చెప్పింది. ఇక ద‌ర్శ‌కుల్లో ఎవ‌రెవ‌రు.. భార్య‌ల చేతికి చిక్కార‌నేది అది మ‌రో ఏపిసోడ్‌. జ్ఞాన‌పీఠ అవార్డు సంపాదించిన రావూరి భ‌ర‌ద్వాజ రాసిన పాకుడ‌ురాళ్లు న‌వ‌ల ఆనాటి వెండితెర వెలుగుల‌కు అద్దంప‌డుతోంది. ఇప్పుడు శ్రీరెడ్డి బ‌హిరంగంగా చెబుతున్నా.. ఆనాడే రావూరి తెర వెనుక భాగోతాల‌కు అక్ష‌ర‌రూపం ఇచ్చారు.
ఇక‌.. ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ఖ‌డ్గంలో ఒక్కఛాన్స్ అంటూ ప‌ట్ట‌ణం చేరిన ఓ అంద‌మైన అమ్మాయి.. వేషం కోసం.. ఎంత‌గా దిగ‌జారాల్సి వ‌చ్చింద‌నేది ఆనాడే వెండితెర‌పై క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపారు. మీ ఇంటికి వ‌స్తే.. మేం ఇది తెస్తా.. మా ఇంటికి వ‌స్తే.. మీరేమి తెస్తారనే వ్యాపార ధోర‌ణి ప్ర‌తిచోటా ఉంది. అయితే వెండితెర‌పై గ్లామ‌ర్ ప్ర‌పంచంలో వెలిగిపోవాల‌నే ఆశ మాత్ర‌మే ఇక్క‌డ పెట్టుబ‌డి.. అవ‌త‌ల ఎవ‌రున్నా.. వారికి అంద‌మైన శ‌రీర‌మే రాబ‌డి. బ‌య‌ట‌కు వ‌చ్చి సుద్దులు చెప్పే ఎంద‌రో బాగోతాలు.. ఇప్ప‌టికీ గుప్పిట మూసిన ర‌హ‌స్యాలే. ఒక్క‌సారి గుప్పెట తీస్తే.. సంసారాలు బ‌జారుపాలే. అందుకే.. సున్నిత‌మైన అంశాన్ని డీల్ చేసేందుకు ఏ ఒక్క‌రూ సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. మ‌రెవ‌రూ ముందుకు రాలేక‌పోతున్నారు. ఒక‌వేళ వ‌స్తే.. త‌మ మీద బుర‌ద‌జ‌ల్లించుకోవాల్సి వ‌స్తుంద‌నే భ‌యం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*