శ్రీరెడ్డికి పెరుగుతున్న మద్దతు

శ్రీరెడ్డికి మద్దతు పెరుగుతోంది. మహిళా సంఘాలన్నీ ఆమెకు అండగా నిలిచాయి. సినీ పరిశ్రమలో ఆర్థిక, లైంగిక దోపిడీని అడ్డుకుని తీరుతామని వారు హెచ్చరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పలు మహిళా సంఘాల నేతలు కలిశారు. జూనియర్‌ ఆర్టిస్టుల నుంచి హీరోయిన్ల దాకా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. శ్రీరెడ్డి నిరసనతో ఒక్కోటిగా చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పీఓడబ్ల్యూ నేతలు జి.ఝాన్సీ, సంధ్య, భూమిక సంస్థ వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి, సామాజిక కార్యకర్తలు దేవి, విమల, ఎన్‌.జ్యోతి, బి.విజయ, కె.సజయ కూడిన ప్రతినిధుల బృందం సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసి వాస్తవ పరిస్థితిని వివరించారు. చిత్ర పరిశ్రమలో మహిళలను రక్షించేందుకు ఓ కమిటీని వేయాలని వినతిపత్రం ఇచ్చారు. 
శ్రీరెడ్డి నిరసనకు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) స్పందించిన తీరు అవమానకరంగా ఉందని వారు అంటున్నారు. ‘మా’ ఆమెకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సినీనటి, ‘మా’ సభ్యురాలు అపూర్వ చాలా ఆశ్చర్యకరమైన నిజం చెప్పారు. శ్రీరెడ్డిపై ‘మా’ తీసుకున్న నిర్ణయం తమకెవరికీ తెలియదన్నారు. ఎవరో కొందరు ఇలాంటి నిర్ణయం తీసుకుని అందరూ ఆమోదిస్తున్నట్లు చెప్పడం బాగోలేదన్నారు. ఫలితంగా ఈ వ్యవహారం మావీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో చీలికలు తేనుంది. దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు ఇందులో ఇరుక్కోవడంతో వివాదం మరింతగా తెరపైకి వచ్చింది. 
ఎన్నారైలు స్పందించాలట
కామలీల పెద్దల గుట్టు ఇది అంటూ సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న శ్రీముఖి తాజాగా కరాటే కల్యాణిని తెలుగు అసోసియేషన్స్ బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘కరాటే కల్యాణి, ఆమె చెంచాలు అనవసరంగా ఎన్ఆర్ఐ(అమెరికా)లను ముగ్గులోకి లాగుతున్నారు. ఛండాలానికి అంతా కారణం ‘మా’ అసోసియేషన్. కల్యాణి ఎన్‌ఆర్ఐ బాడీస్‌కి ఈ ఛండాలాన్ని అంటించాలని చూస్తోందని చెబుతోంది. ఎన్ఆర్ఐలు ఈ విషయంపై స్పందించాలని కోరుతోంది. కరాటే కల్యాణి తెలుగు అసోసియేషన్స్ బ్యాన్ చేయాలని కోరుతోంది. ఒకవేళ ‘మా’ అసోసియేషన్ ఫండ్స్ కోసం వస్తే వారిని వెనక్కు పంపాలని కోరుతోంది. ‘మా’ అసోసియేషన్ ఆ ఛండాలాన్నంతా ఎన్ఆర్ఐకి అంటించాలని చూస్తోంది. ఈ విషయం మనసులో ఉంచుకోండి. తాను యూఎస్‌కి వచ్చి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నిజస్వరూపం ఏంటో బయటపెడతానని చెప్పింది. ఎంతమంది బ్లాక్ మెయిల్ చేసినా నేను ఈ పోరాటాన్ని ఆపను అని శ్రీరెడ్డి పోస్ట్ పెట్టడం కలకలం రేపుతోంది.
శ్రీరెడ్డికి శుభవార్త…
శ్రీరెడ్డి పోరాటానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) బాసటగా నిలిచింది. ఈ మేరకు తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసారశాఖకు నోటీసులు జారీ చేసింది. శ్రీరెడ్డి ఆరోపణలను ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. సమస్య పరిష్కార యంత్రాంగం లేకపోవడం పెద్ద లోటు అని మానవ హక్కుల సంఘం చెప్పింది. తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఉన్నాయని చెబితే విచారించాల్సింది పోయి.. ఇలా ఎదురు దాడికి దిగడం మంచిది కాదని హితవు పలికింది. నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆ నోటీసులు చెప్పింది. సినిమాల్లో నటించకుండా ఆంక్షలు విధించడం… శ్రీరెడ్డి హక్కులకు భంగం కలిగించడమేనని ఎన్‌హెచ్‌ఆర్సీ అభిప్రాయపడింది. 
తల్లి ఏమన్నారంటే…
తల్లిదండ్రులకు దూరంగా ఉంటోంది శ్రీరెడ్డి. ఇదే విషయంపై శ్రీరెడ్డి తల్లి పుష్పవతి స్పందించింది. ఏ తల్లి తన కూతురు అర్థ నగ్న ప్రదర్శన చేయాలని కోరుకోదు. మేము అంతే. కాకపోతే ఇవి తెలియడంతో మాకే ఇబ్బందిగా ఉంది. మా ఇంట్లో నుంచి శ్రీరెడ్డి వెళ్లిపోయి 10 ఏళ్లు అవుతోంది. వెళ్లాక ఆరేళ్ల పాటు మాతో అసలు మాట్లాడలేదు. తప్పు చేస్తున్నావు అని చెబితే… ‘మీరు చెప్పొద్దు.. నాకు ఫోన్ చేయడం కూడా మానేయండి’ అంటోందని ఆవేదన వ్యక్తం చేసింది. మేము ఇలా అర్ధనగ్న ప్రదర్శన లాంటివి సపోర్ట్ చేయం. చేయమని చెప్పం. పదిమందికి మంచి జరిగితే మాత్రం తన పోరాటాన్ని సమర్థిస్తాం. అది తప్పయితే మాత్రం ఆపాలని చెప్తామని అంటోంది. ఫలితంగా శ్రీరెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపికైంది. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*