శ్రీరెడ్డి బాంబుతో దగ్గుబాటి కుటుంబంలో కలవరం

శ్రీ రెడ్డి బాంబులు పేలుస్తోంది. ఫలితంగా టాలీవుడ్ లో ప్రకంపనలు రేగుతున్నాయి. ఇప్పుడు ఆమె ఓ సంచ‌ల‌నంగా మారింది. న‌గ్నంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసి దేశం దృష్టిని ఆక‌ర్షించింది. శేఖ‌ర్ క‌మ్ముల‌, నాని వంటి వారి మీద సోష‌ల్ మీడియాలో చేసిన కామెంట్స్ తో హాట్ హాట్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ వార‌సుడి విషయం వీధికెక్కింది. ద‌గ్గుబాటి రానా వ్య‌వ‌హారం ప‌లుమార్లు చ‌ర్చ‌నీయాంశమైంది. శ్రీరెడ్డితో చ‌నువుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ద‌గ్గుబాటి అభిన‌య్ ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కు వచ్చాయి. శ్రీరెడ్డి తొలి అస్త్రాన్ని వదిలింది. మరో 90 శాతం అస్త్రాలు సిద్దంగా ఉన్నాయని చెబుతోంది. ఫలితంగా తనను వేధించిన వారి పూర్తి ఆధారాలు బ‌య‌ట‌పెట్టే వీలుంది. 
అదే పని చేస్తే చాలా పెద్ద వారి గుట్టు రట్టు అయ్యే వీలుంది. ఆమె చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ మాత్రం ఎదురుదాడికి దిగడం ఆశ్చర్యమేస్తోంది. దగ్గుబాటి వారి అబ్బాయితో చేసిన చాట్ విషయాలను బహిరంగ పరచడంతో తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. మరోవైపు సిఎం కేసీఆర్ ను కలిసి ఫిర్యాదు చేయనుంది శ్రీరెడ్డి. అదే జరిగితే టాలీవుడ్ కు మరక ఖాయం. డ్రగ్స్ కేసునే తొక్కేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ఇదేమంత వ్యవహారం కాదు. కానీ ప్రజా సంఘాలు ఇప్పుడు శ్రీరెడ్డికి అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా చెడ్డ పేరు తెచ్చుకోవడానికి సర్కార్ సిద్దంగా లేదు. 
శ్రీరెడ్డి వ్య‌వ‌హారంలో స‌మ‌గ్రంగా వ్య‌వ‌హ‌రించ‌పోతే మ‌రిన్ని సంచ‌ల‌నాలు బ‌య‌ట‌ప‌డే ప్ర‌మాదం ఉంది. ద‌గ్గుబాటి అభిన‌య్ వ్య‌వ‌హారం త‌ర్వాత చాలామంది సినీ పెద్ద‌లు శ్రీరెడ్డితో సంప్ర‌దింపుల‌ు మొదలు పెట్టారు. తమ సంగతి బయట పెట్టవద్దని వేడుకుంటున్నారు. ఫలితంగా శ్రీరెడ్డి ఇప్పుడు ఏం చేస్తుందోనన్న ఉత్కంఠ నెలకుంది. మరెవరు పేర్లు బయటకు వస్తాయో చూడాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*