ప్ర‌త్యేక హోదాకు కేజ్రీవాల్‌ మ‌ద్ద‌తు

దేశ రాజ‌కీయాల్లో కేజ్రీవాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఢిల్లి పెద్ద పార్టీల‌ను మ‌ట్టిక‌రిపించిన ఘ‌న‌త ఆయ‌న‌ది. ఢిల్లి ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తూ ఆమ్ ఆద్మి పార్టీని విస్త‌రిస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీని థీటుగా ఢీ కొడుతున్నారు. తాజాగా ఆయ‌న‌ మ‌రోసారి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా మారారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంఘీభావం తెలిపారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ వద్ద ఎంపీలు చేస్తున్న ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ సరైనదేనని, ‘హోదా’ ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు. ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్తే టీడీపీ ఎంపీలను అరెస్టు చేశారని, వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం బాధాకరమని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని మరోమారు స్పష్టం చేసిన కేజ్రీవాల్, ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. కేజ్రీవాల్ లాంటి వారు ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం శుభ‌ప‌రిణామ‌మే అన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్య‌లో రాజ‌కీయ మ‌త‌ల‌బు ఏమైన ఉందా అని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*