మూడో కూటమి లేదట

హస్తినలో సిఎం చంద్రబాబునాయుడుతో జాతీయ నేతలు ఏం మాట్లాడారు. ఏంటనేది ఆసక్తికర విషయమే. అసలు సంగతి ఏంటంటే… జాతీయ రాజకీయాల్లోకి రావాలని శరద పవార్, మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా వంటి వారు బాబును కోరారు. కానీ మూడో ఫ్రంట్ వద్దని వారంతా చంద్రబాబుకు చెప్పారట. బీజేపీకి వ్యతిరేకంగా ఇంకో కూటమి వస్తే అది వైరి వర్గానికే లాభమని చెప్పారట. అదే సంగతిని చంద్రబాబు వివరించారు. సోనియాగాంధీ నేతృత్వంలోని కూటమిలో కలవాలని.. రేపు సీట్ల అవసరమొస్తే బీజేపీకి చుక్కలు చూపించవచ్చనేది వారి ఆలోచనగా ఉంది. అదే సంగతి చెప్పారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. అందుకే వారితో కలిసేందుకు చంద్రబాబు తటపటాయిస్తున్నారు. ఇంకోవైపు ప్రధాని మోడీ, అమిత్ షాలకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీలోని కొందరు చంద్రబాబును దువ్వే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పుడు కాకపోయినా 2019 నాటికి మోడీ వైరి వర్గం బలపడుతోంది. వారిద్దరినీ తప్పించి కొత్త వారిని రంగంలోకి దించే పని చేస్తారట. ఆ సంగతి చెబుతున్నారు. ఇప్పుడు కాకపోయినా రాబోయే కాలంలో తమ కూటమిలోకి రావాలని వారు ఆహ్వానిస్తున్నారు. 
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం అదే మాట చెప్పారట చంద్రబాబుకు. అందుకే ఇక బీజేపీతో వద్దని తెగదెంపులు చేసుకున్నారంటున్నారు. ఇంకోవైపు కమలం ఊసే వద్దంటున్నారు సిఎం చంద్రబాబు. కేసీఆర్ నేతృత్వంలో కూటమి ఏర్పాటు అంతా తూచ్ అంటున్నారు. ఏదో మీడియా కోసం హడావుడి చేయడం తప్ప కేసీఆర్ కు పెద్దగా ఎవరి నుంచి మద్దతు లభించలేదంటున్నారు. మమతా బెనర్జీని కలిసిన ఆశించిన ప్రయోజనం లేదు. ఇంకోవైపు కేసీఆర్ ను మమత నమ్మడం లేదని తెలుస్తోంది. బీజేపీకి అనుకూలంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*