శ్రీరెడ్డి.. కేసీఆర్‌ను వ‌ద‌ల్లేదుగా!

పొగ‌రు సినిమాలో.. విశాల్ కు ధీటుగా విల‌నిజం చూపిన‌.. శ్రీరెడ్డి.. కొద్దికాలంగా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీపై సంచ‌లన కామెంట్స్ చేస్తోంది. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌, తేజ నుంచి నేచుర‌ల్ స్టార్ నాని వ‌ర‌కూ ఎవ‌ర్నీ వ‌ద‌ల్లేదు. ఎవ‌రెవ‌రు ఎలాంటివారో.. వారు.. బ‌య‌ట‌కు ఎలా క‌నిపిస్తారు.. అస‌లు లోగుట్టు ఏమిట‌నేది త‌న వ‌ద్ద ఉందంటూ రోజుకో బాంబు పేల్చుతుంది. దీనిపై ఫిలింఛాంబ‌ర్ పెద్ద‌లు జోక్యం చేసుకుని స‌ర్ది చెప్పేందుకు ప్ర‌య‌త్నించినా ఆమె మాత్రం త‌న నోటికి తాళం వేయ‌ట్లేదు. పైగా ఇన్‌డైరెక్ట్‌గా రోజుకో హీరో పేరు తెస్తుంది. అయితే దానిలో వాస్త‌వాలు ఎలా వున్నా.. హీరోలు, ద‌ర్శ‌కుల‌కు మాత్రం పొద్దునే ఆమె నోటి నుంచి ఎవ‌రి పేరు వినాల్సి వ‌స్తుంద‌నే భ‌యం మొద‌లైంద‌ట‌.
పైగా కొంద‌రి ఇళ్ల‌లో ఇప్ప‌టికే స‌మ‌స్య మొద‌లైంద‌ట‌. ఏమిలేక‌పోతే.. శ్రీరెడ్డి ఎందుకు మాట్లాడుతుంద‌నే సందేహాలు కూడా స‌జావుగా సాగే సంసారాల్లో చిక్కులు తెస్తుందంటూ ఓ ద‌ర్శ‌కుడు త‌న మిత్రుల వ‌ద్ద వాపోయాడ‌ట కూడా. అటువంటిది.. ఇప్పుడామె ఏకంగా తెలంగాణ సీఎంను కూడా వ‌దల్లేదు. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కేసీఆర్ చూపాలంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌చేసింది. త‌మ బాధను అర్ధం చేసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానంటూ హెచ్చ‌రించ‌ట‌మే కాదు.. అవ‌స‌ర‌మైతే తాను న‌గ్నంగా మారి జ‌నంలోకి వెళ్తానంటూ ఊహించ‌ని ప్ర‌క‌ట‌న చేసింది. ఇది.. సినీ జ‌నాల‌కు ఊహించ‌ని షాక్ అనే చెప్పాలి. దీంతో కొంద‌రు పెద్ద‌లు రంగంలోకి దిగి.. అమ్మా నీకేం కావాలి.. ద‌య‌చేసి పోస్టింగ్స్ పెట్ట‌డం ఆప‌మంటూ మొత్తుకుంటున్నార‌ట‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*