తేజ్‌… ఆశ కరుణాక‌ర‌న్ తీర్చేస్తారా!

వ‌రుస ప్లాప్‌ల‌తో ఇబ్బందిప‌డుతున్న మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌రమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభ‌మైంది. కె.ఎస్‌.రామారావు నిర్మాత‌గా క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తేజ్ ఐ ల‌వ్‌యూ సినిమా షూటింగ్ మొద‌లుపెట్టారు. మెగా కాంపౌండ్ నుంచి వ‌చ్చిన సాయిధ‌రమ్‌తేజ్ అచ్చు చిరంజీవిలా ఉన్నార‌నే పేరు తెచ్చుకున్నాడు. మేన‌మామ ఫీచ‌ర్స్ కాదు.. డ్యాన్స్‌లోను అనుక‌రించ‌సాగాడు. ఆయ‌న పాట‌లనే రీమేక్ చేసుకుంటూ నెగ్గాల‌ని ప్ర‌య‌త్నించాడనే అప‌వాదు మూట‌గ‌ట్టుకున్నాడు. దీంతో విన్న‌ర్‌, ఇంటింల్‌జెంట్ వ‌ర‌కూ వ‌రుస‌గా నాలుగు సినిమాలు ఆశించినంత ఆడ‌లేదు. వినాయ‌క్‌తో చేసిన ఇంటిల్‌జెంట్‌పై గంపెడాశ‌లు పెట్టుకున్నా.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాడు. దీంతో ఇప్పుడు ప్రేమ‌క‌థ‌తో త‌న‌లో న‌టుడిని బ‌య‌ట‌కు తీస్తానంటున్నాడు. మెగాఫ్యామిలీలో దాదాపు.. వ‌రుణ్‌తేజ్‌, అల్లు అర్జున్‌, చివ‌ర‌కు శిరీష్‌.. ఈ మ‌ధ్య రంగ‌స్థ‌లంలో రామ్‌చ‌ర‌ణ్ మాంచి స‌క్సెస్‌లు సాధించారు.. ఇప్పుడు దాన్ని కొన‌సాగిస్తూ.. సాయిధ‌రమ్‌తేజ్ త‌ప్ప‌నిస‌రిగా హిట్ సాధించాల్సి ఉంది. మ‌రి తేజ్ ఆశ‌ల‌ను కరుణాక‌ర్ ఎంత‌వ‌ర‌కూ తీర్చుతార‌నేది తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే మ‌రీ.?
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*