పతాక స్థాయికి చేరిన హోదా పోరు

నవ్యాంధ్ర హోదా కోసం పోరు తీవ్రమైంది. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు. ఆమరణ దీక్షలకు దిగుతున్నారు. మరోవైపు సభలోనే బైఠాయించాలని టీడీపీ నిర్ణయించింది. ఇంకోవైపు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు. ఏపీలో టీడీపీ సైకిల్‌, బైకు ర్యాలీలు చేస్తున్నారు. అసెంబ్లీకి సైకిళ్లపై వచ్చారు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు. జనసేన, సిపిఐ, సిపిఎం నేతలు పాదయాత్రలు చేస్తున్నారు.  పవన్ కల్యాణ్ విజయవాడలో యాత్ర చేయడంతో ప్రజలు సంఘీభావం తెలిపారు.
మొత్తంగా ఏపీ హోదా పోరు పతాకస్థాయికి చేరింది. ఎవరికి వారే హోదా కోసం తామే పోరాటం చేస్తున్నట్లు ప్రయత్నిస్తున్నారు. ఇదే పోరు గతంలోనే చేస్తే ఇంత పరిస్థితి వచ్చేది కాదనేది వాస్తవం. జిల్లాల్లోను ర్యాలీలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల స్వయంగా బాబు పాల్గొని హోదా పోరుతో ఢిల్లీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ఉద్యమ వేడి పెరిగింది. సభ వాయిదా పడినా టీడీపీ నేతలు అక్కడే ఉండి నిరసన చేయడం మాములు విషయం కాదు. మార్షల్స్ సాయంతో వారిని బయటకు పంపించారు స్పీకర్. కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చింది కేంద్రం. వైకాపా, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, లోక్ సత్తా వంటి పార్టీలు కేంద్రం తీరును తప్పుపట్టాయి. ఇప్పిటికైనా కేంద్రం తీరు మార్చుకోవాలని కోరుతున్నాయి. ఇది ఏపీ బీజేపీ నేతలను ఇబ్బందికి గురి చేస్తోంది. ప్రజలంతా హోదా అడుగుతుంటే.. ఏపీకి అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తుంటే.. తాము ఆదుకున్నామని చెప్పేందుకు తటపటాయిస్తున్నారు. మొత్తంగా గతంలో కాంగ్రెస్ కు ఏర్పడిన పరిస్థితి, ఇప్పుడు బీజేపీకి వచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*