తెలుగు సినీ ఇండ‌స్ట్రీకు ఏమైందీ!

ఓ పక్క డ్ర‌గ్స్ గోల‌.. మ‌రోవైపు  నంది పుర‌స్కారాల‌పై ర‌చ్చ‌.. ఇప్పుడేమో.. శ్రీరెడ్డి పేల్చిన శేఖ‌ర్‌క‌మ్ముల బాంబ్‌. ఇంత‌కీ.. తెలుగు ఇండ‌స్ట్రీకు ఏమైంది. ఎవ‌రికెవ‌రు శ‌త్రువులు.. ఇంకెవ‌రు మిత్రులు అనేది అంతా  గ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంది. ఓ నిర్మాత‌.. సినీ ఇండ‌స్రీ న‌లుగురి చేతుల్లో ఉందంటాడు. మ‌రో ద‌ర్శ‌కుడు.. అదేం కాదు.. టాలెంట్ ఎక్క‌డుంటే.. అక్క‌డే ఉత్సాహం ఉంటుందని క‌వ‌ర్ చేస్తున్నారు. వాస్త‌వానికి సినీ ఇండ‌స్ట్రీ ద‌గ్గుబాటి, నంద‌మూరి, అక్కినేన , మెగాఫ్యామిలీ కాంపౌండ్స్ చుట్టూ తిరుగుతుంద‌నే వాద‌న ఉంది. దాస‌రి నారాయ‌ణ బ‌తికున్నంత‌కాలం ఆయ‌నే అంద‌ర‌కీ పెద్ద‌దిక్కుగా ఉండేవారు. ఎవ‌రికి ఏ స‌మ‌స్య వచ్చినా ఆయ‌న వ‌ద్ద‌కే వెళ్లేవారు. ఆయ‌న మ‌ర‌ణంతో ఎవ‌రికే స‌మ‌స్య వ‌చ్చినా ఎవ‌రి వ‌ద్ద‌కు వెళ్లాల‌నేది ఇప్ప‌టికీ ప్ర‌శ్నార్ధ‌కంగానే మిగిలింది. చిరంజీవి, మోహ‌న్‌బాబు, బాల‌కృష్ణ వంటి సీనియ‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ పెద్ద‌రికం జోలికి వెళ్ల‌లేదు. ముగ్గురిలో ఏ ఒక్క‌రి వ‌ద్ద‌కు వెళ్లినా.. మ‌రో ఇద్ద‌రు ఏమ‌నుకుంటార‌నేది భ‌యం కూడా ఉంద‌నే అనుమానాలున్నాయి. ఎవ‌రి సినిమాలు వాళ్లు తీసుకుంటూ కోట్లు వేట‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. దీంతో ఎవ‌రికి ఏస‌మ‌స్య వచ్చినా తొలుత స్పందించేవాళ్లు కూడా క‌ర‌వ‌య్యార‌నే చెప్పాలి.
ఇప్పుడు శ్రీరెడ్డి అనే చిన్న న‌టి తెలుగు సినిమాలో తెలుగు న‌టీమ‌ణుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌టంపై ఘాటుగానే కామెంట్స్ చేసింది. కొంద‌రు త‌మ‌ను వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకుంటారంటూ కొంద‌రు ద‌ర్శ‌కులు దీనికి పెట్టింది పేరంటూ ప‌డ‌క‌గ‌దికే తెలుగు అమ్మాయిలు ప‌రిమిత‌మంటూ ఓ టీవీ ఛాన‌ల్ చ‌ర్చావేదిక‌లో బాంబు పేల్చింది. దీంతో శేఖ‌ర్ క‌మ్ముల స్పందించారు. త‌న‌కు తెలియ‌ని ఓ అమ్మాయి ఇటువంటి అబాండాలు వేయ‌టంపై కోపంగానే స్పందించారు. క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే.. పోలీసుకేసుల వ‌ర‌కూవెళ్లాల్సి వ‌స్తుందంటూ హెచ్చ‌రించారు. దీనిపై శ్రీరెడ్డి కూడా సోష‌ల్ మీడియా ద్వారా జ‌వాబిచ్చారు. ఏదో.. నాలాంటి సెకండ్ గ్రేడ్ న‌టులు.. ప్ర‌చారం కోసం.. అభిమానుల‌కు స్పైసీ పంచేందుకు ఇట‌వంటివి చెబ‌తుంటామంటూ బ‌దులిచ్చింది. శేఖ‌ర్‌గారు కోపం వ‌ద్దంటూ వేడుకున్న‌ట్లుంది. అయితే మ‌రోవైపు త‌న వ‌ద్ద పక్కా ఆధారాలున్నాయంటూ మ‌రో బాంబు పేల్చింది. మ‌రి.. ఇదంతా ఇంత‌టితో ఆగుతుందా.. పుట్ట‌లో పాములుగా లోప‌ల దాచిన‌.. గుట్టును బ‌య‌ట‌పెడ‌తారా! అనేది సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*