ఢిల్లీలో తెలుగోడి దెబ్బ చూపించిన చంద్రబాబు

హస్తినకు వెళ్లిన చంద్రబాబు తెలుగోడి సత్తా చూపించాడు. ఎంతగా అంటే ఆధారాలతో సహా చెప్పడంతో బిత్తరపోవడం బీజేపీ వంతు అయింది. ఒక రాష్ట్ర సిఎం ఢిల్లీకి వచ్చి మరీ అధికార పార్టీకి వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడి మరీ వెళ్లడం ఇదే ప్రధమం. ఆడియో, వీడియో ఆధారాలను చూపించి..వారు ఏం ఇచ్చారు. మేము ఏం ఇచ్చాం. అనే విషయాలను జాతీయ మీడియా ముందు ఉంచారు బాబు. అది చాలు తెలుగు వారి చరిత్ర గురించి చెప్పుకోవడానికి అనే చర్చ సాగుతోంది. ఏపీ అభివృద్ధి కోసమే తాము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు చంద్రబాబు. సాయం చేస్తుంది అనుకున్నాం. కానీ చేయలేదు. కావాలని ఏపీ అభివృద్ధిని అడ్డుకునే పని చేస్తుందని చెప్పారు. తిరుపతి సభలో, అమరావతి రాజధాని శంఖుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని మోడీ ఏం చెప్పారో..ఇప్పుడు ఏం చేస్తున్నారో వీడియోలు చూపించి మరీ మీడియాకు వివరించిన తీరు పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. 
బీజేపీ ఆదుకున్నామని చెబుతున్నా..ఆచరణలో అంతంత మాత్రంగానే ఉన్న సంగతి తెలిసిందే. పోలవరం, పట్టిసీమ, విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా, ప్యాకేజి వంటి అంశాలను వివరించారు. మీడియా ప్రతినిధులు ఏది అడిగినా తడుముకోకుండా చెప్పిన తీరు ఆకట్టుకుంది. అసలు బీజేపీకి గట్టి మగాడు దొరికాడురా బుజ్జి అంటున్నారు అక్కడి నేతలు. ఆంధ్రా గల్లీల్లో కాదు..హస్తిన వీధుల్లోకి వచ్చి తొడ గొట్టి వచ్చాడనే వాదన సాగుతోంది. ఒక తెలుగువాడు…ప్రధానికి వ్యతిరేకంగా ఇంత తీవ్ర స్థాయిలో ఏనాడు ఎవరూ ధ్వజమెత్తలేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంటనే కాదు..రచ్చ గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. 
చంద్రబాబు ప్రతి కదలికను ఎప్పటికప్పుడు తెప్పించుకుంది బీజేపీ. ఆయన్ను ఎవరు కలుస్తున్నారు..ఎందుకు కలుస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారనే అంశం పై బీజేపీ పెద్దలు దృష్టి సారించారు. అదే సమయంలో కొందరు న్యాయమూర్తులను చంద్రబాబు కలిసే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం సాగింది. అంతా బాగానే ఉన్నా.. మీడియా కోసం చంద్రబాబు ఫోజులు ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. వారు ఫోటోలు తీసినా తీయక పోయినా తన పని తాను కానివ్వాలి. కానీ అలా కాకుండా మీడియా కోసం అన్నట్లుగా పార్లమెంటు మెట్ల వద్ద వంగి వంగి పోటోల కోసం చూడటం మైనస్ గానే చెప్పాలి. మొత్తంగా హస్తిన టూర్ బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. 
 ఈ దెబ్బతో ప్రధాని మోడీ సానుకూలమైన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలా చేస్తే అది బీజేపీ ఎలా అవుతోంది. పవన్ కల్యాణ్ తోను..మరో నేతతోను ఆమరణ దీక్షలు చేయించి మరీ ఆ తర్వాత కొన్ని రాయితీలు ఏపీకి ఇచ్చే వీలుంది. అది టీడీపీకి మేలు జరగకుండా పావులు కదిపే వీలుంది. ఈ దెబ్బతో బీజేపీతో దాదాపు తెగదెంపులు చేసుకున్నట్లేనని చెప్పాలి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*