కాంగ్రెస్ తో దోస్తీకి టీడీపీ ఆరాటం

కాంగ్రెస్ తో దోస్తీకి టీడీపీ ఆరాటపడుతుందనేది బీజేపీ చేసే ఆరోపణ. ఏపార్టీకి వ్యతిరేకంగా టీడీపీ స్థాపించారో అదే పార్టీకి అనుకూలంగా మారిందని విమర్శిస్తోంది. శరద్ పవార్, అహ్మద్ పటేల్ వంటి నేతలతో చంద్రబాబు మంతనాలు చేయడం రాజకీయ వ్యూహంలో భాగమనేది కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అంటున్న మాట. టీడీపీకి సిద్దాంతాలు, పద్దతులు అంటూ ఏం లేవు. గెలుపు కోసం ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటోంది. ఏ పార్టీతోనైనా విభేదిస్తోంది. అందుకే ఆపార్టీ అధినేత చంద్రబాబుకు విలువ లేకుండా పోయిందనేది కమలనాథులు చేస్తున్న వాదన. ఢిల్లీలో ప్రధాని మోడీ ఉంటున్న గడ్డపై తెలుగోడి సత్తా చూపించడంతో బీజేపీకి సీన్ అర్థమైంది. అంతే కేంద్ర మంత్రిని రంగంలోకి దించింది. చంద్రబాబును తిట్టమని చెప్పింది. అంతే ఆయన తనకున్న అవగాహనతో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని బాంబు పేల్చారు. టీడీపీకి ఒక సిద్దాంతం పాడు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. 
ఇదంతా పార్టీ పెద్దలు చెప్పారు కాబ్టటే ఆ పని చేసారు కేంద్ర మంత్రి. ఆఫ్ ది రికార్డు అసలు విషయం ఏంటంటే.. ఎవరైనా రాజకీయ అవసరాలు చూసుకోకుండా ఎలా ఉంటారనేది ఆయన మాటగా ఉంది. ఏదో మా పార్టీ నేతలు చెప్పారు చంద్రబాబు తీరును తప్పు పట్టమని అదే పని చేశారంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నేతలతో చేతులు కలిపితే బీజేపీకి ఇబ్బందే. సోనియాగాంధీ ఇప్పటికే తన నేతలను పంపించి చంద్రబాబుతో రాయబారాలు చేయించింది. ఫలితంగా కాంగ్రెస్, టీడీపీ చేతులు కలపొచ్చనే సంకేతాలు వెళుతున్నాయి. ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికలలో పోటీ చేశామో, ఆ కాంగ్రెస్ తో ఇప్పుడు చంద్రబాబు చేతులు కలిపారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. 
ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ అంటే ప్రత్యేక అభిమానం ఉందని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. అందుకే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా నిధులు ఇచ్చామంటోంది. చంద్రబాబు ఏం ఇవ్వలేదంటున్నారు. బీజేపీ అన్నీ ఇస్తున్నట్లు చెబుతోంది. ఏపీకి మోదీ ఏమీ ఇవ్వలేదన్న టీడీపీ ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు బీజేపీ నేతలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. చంద్రబాబు రాజకీయాల కోసమే మాట్లాడుతున్నారని అన్నారు. అభివృద్ది విషయంలో రాజకీయం చేయడం బీజేపీ లక్ష్యం కాదని ఆయన అంటున్నారు. రాజకీయ కారణాలతో చంద్రబాబు ఎన్.డి.ఎ. నుంచి బయటకు వెళ్లారు. అది నిజం. ఇందులో తమ తప్పులేదన్నారు బీజేపీ నేత. వైఎస్ఆర్ కాంగ్రెస్ తో తమకు సంబంధం అని తప్పుడు ఆరోపణను చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ లేనిదే టీడీపీ లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయి. అందుకే ఇవ్వడం లేదన్నారు కేంద్ర మంత్రి. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*