త‌మ్ముడుపై .. అన్న‌య్య ఎఫెక్ట్‌!

మెగాస్టార్‌.. చిరంజీవి. రాజ్య‌స‌భ స‌భ్యత్వం ముగిసింది. ఇక రాజ‌కీయాల్లో కొన‌సాగుతారా! లేదా! అనే దానిపై క్లారిటీ లేదు. దాదాపు ఇక రాజ‌కీయాల‌కు దూరంగానే ఉంటార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. పీఆర్ పీతో రాజ‌కీయ ప్ర‌వేశం.. కాంగ్రెస్‌లో విలీనం కావ‌టం వ‌ర‌కూ.. అన్నిచోట్లా ఎన్నో ఎదురుదెబ్బ‌లు రుచి చూశారు. సినీరంగంలో ఎదిగేందుకు ఎన్ని అడ్డంకులు చ‌విచూశారో.. తెలియ‌దు కానీ.. రాజ‌కీయంగా మాత్రం.. మెగాస్టార్ అంద‌రివాడు కాస్తా.. కేవ‌లం కొంద‌రివాడుగా మిగిలిపోయారు. వెండితెర‌పై అభిమానించిన వారు కూడా చాలామంది దూర‌మయ్యారు. పార్టీను హ‌స్తంలో విలీనం చేయ‌టంతో ప‌రాకాష్ట‌కు చేరుకున్నారు. దీన్ని తొలినుంచి విమ‌ర్శించే త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా 2014లో జ‌న‌సేన కొత్త‌పార్టీతో రాజ‌కీయ ప్ర‌వేశం చేశారు. రావ‌టంతోనే.. అటు క‌మ‌లం.. ఇటు సైకిల్‌ను రెండు భుజాల మోస్తూ.. ఉడ‌తా భ‌క్తి సాయం అందించారు. అంత‌వ‌ర‌కూ ఓకే.. నాలుగేళ్ల త‌రువాత ఇద్ద‌రితో మైత్రీబంధం బీట‌లు బారింది.
ఇక ముందు వామ‌ప‌క్షాల‌తో క‌ల‌సి న‌డుస్తార‌నేది వినిపిస్తున్నా.. ఓట్లు ప‌డ‌ని పార్టీల‌తో అధికారం క‌ల్ల అనేది తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఒంట‌రిగా వెళ‌తారా.. టీడీపీ, బీజేపీతో స‌రికొత్త బంధంతో 2019లో బ‌య‌ల్దేర‌తారా అనేది ఇప్ప‌టికి స‌స్పెన్స్‌. అన్న‌య్య‌వి.. నావి భిన్న‌దారుల‌ు.. వైవిధ్య‌మైన మార్గాలంటూ త‌మ్ముడు చెబుతున్నా.. ప్ర‌తిప‌క్షాలు మాత్రం.. ఆయన అన్న‌ను మించిన త‌మ్ముడు అంటూ బుర‌ద‌ జ‌ల్లుతున్నాయి. ప‌దేప‌దే.. విమ‌ర్శ‌ల‌కు ప‌ద‌ను పెట్ట‌డం ద్వారా.. జ‌నంలో కూడా ఇదేర‌క‌మైన అనుమానాలనురేకెత్తించే అవ‌కాశాలు లేక‌పోలేదు. ప‌వ‌న్ నే న‌మ్ముకుని రాజ‌కీయంగా కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాల‌ని.. ప్ర‌జాజీవితంలో ముందుకు సాగాల‌ని భావించే వారికి కూడా.. త‌మ్ముడిపై ఇదే అనుమానం. హోదా విష‌యంలో క్లారిటీ లేదు. పైగా.. చంద్ర‌బాబు, మోదీల‌ను విమ‌ర్శిస్తున్నాడు. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచేందుకు కేవ‌లం త‌న అభిమానులే బ‌ల‌మంటున్నారు. ఇటువంటి క్లిష్ట‌మైన వేళ‌.. ప‌వ‌న్ త‌న పార్టీను మ‌రో జాతీయ పార్టీలో విలీనం చేస్తారా! అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా మెగా ప్ర‌భావ‌మే అయినా.. దాన్నుంచి బ‌య‌ట‌ప‌డాల్సింది మాత్ర‌మే త‌మ్ముడే. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*