ప‌వ‌నుడి జ‌న సైన్యం…

ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న దైన శైలితో రాజ‌కీయాల్లో దూసుకుపోతున్నాడు. జ‌న‌సేన పెట్టి యేడాదే అయిన పెద్ద పార్లీల‌కు సైతం ద‌డ‌పుట్టిస్తున్నాడు. 2019 ఎన్నిక‌ల ల‌క్ష్యంగా వ‌ప‌న్ కార్య‌చ‌ర‌ణ ప్రారంభించాడు. పార్టీ న‌గ‌రాల‌కే ప‌రిమిత్తం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో జ‌న‌సైన్యంను ప‌ట్టిష్టం చేసుకునే దివ‌గా అడుగులు వేస్తున్నారు. జ‌న‌సైన్యం పేరుతో  పేరుతో జనసేన గ్రామ స్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు స్వ‌యంగా ప‌వ‌న్ హైద‌రాబాద్‌లో ప్ర‌క‌టించారు. గుంటూరు సభ ముగిసిన తరువాత 15 రోజుల్లో 17 లక్షలు పార్టీ సభ్యత్వం నమోదు అయింద‌ట‌. ఇందులో 60% యువత సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు.మిస్డ్ కాల్ ద్వారా అతీతంగా అన్ని వర్గాల నుంచి సభ్యత్వ నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న వాళ్లందరికీ  శిక్షణ ఇవ్వ‌నున్న‌ట్టు ప‌వ‌న్ తెలిపాడు. జనసైన్యం పేరుతో గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతానికి సన్నాహాలు చేస్తున్నారు. 
మూడు భాషల్లో పార్టీ సభ్యత్వ కార్డ్ రూపొందించాం జనసేన యాప్ లొనే సభ్యత్వ నమోదు చేసుకునేలా సాఫ్ట్ వేర్‌ను  రూపొందించిన‌ట్టు  జ‌న‌సేన ఐటీ విభాగం చైర్మ‌న్ ముత్తంశెట్టి విజయనిర్మల తెలిపారు.
 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*