మంత్రులే ఎంపీలుగా బరిలోకి….

కేంద్రాన్ని ఢీకొట్టాలంటే చాలా మంది మంత్రులను ఎంపీలుగా చేస్తే మంచిదని ఆలోచిస్తున్నారట చంద్రబాబు. ఫలితంగా మంత్రుల్లో టెన్సన్ మొదలైంది. బీజేపీ, వైసీపీ, జనసేన వామపక్షాల కూటమితో ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది టీడీపీ. అందుకే చాలా జాగ్రత్తగా పావులు కదుపుతోంది. ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు..వీలున్నంత ఎక్కువగా సీట్లు పొందితే కేంద్రంలో చక్రం తిప్పవచ్చనే ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు. అందుకే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరించాల్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది.
లోక్ సభలో ఈ సారి బీజేపీకి సంపూర్ణ మెజార్టీ  రావడం అంత తేలిక కాదు. హంగ్ వచ్చే వీలుంది. అదే జరిగితే చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు చాలా కీలకంగా మారనున్నాయి. 1999లోను ఇలానే టీడీపీ కేంద్రంలో చక్రం తప్పింది. మరోసారి అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు చంద్రబాబు. ఇందుకు సరికొత్త ఎత్తుగడతో వెళుతున్నారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న వారిలో ఎక్కువమందిని వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేయించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. పలువురు మంత్రులకు సంకేతాలు కూడా ఇచ్చారని తెలుస్తోంది. కడప, కర్నూలు, కోస్తా జిల్లాలకు చెందిన కొందరు మంత్రులు ఎంపీలుగా బరిలోకి దిగాల్సి వస్తుందని చంద్రబాబు చెప్పారట. రాష్ట్రంలో మంత్రులు అయ్యే ఛాన్స్ వదులుకుని ఎంపీలుగా పోటీ చేయడానికి చాలా మంది తటపటాయిస్తున్నారు. కానీ చంద్రబాబు చెప్పినట్లు చేయకపోతే  ఇబ్బంది పడే వీలుంది.
పార్టీ అవసరాల రీత్యా ఎంపీలుగా పోటీ చేయాల్సిన బాధ్యత అనేకమంది మంత్రులపై ఉందని చంద్రబాబు చెప్పేశారు. కాకపోతే ఆయన ఇందుకోసం ఎవరిని ఎంపిక చేస్తారనే అంశం టీడీపీలో ఉత్కంఠను పెంచుతోంది. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో దాదాపు సగం మందికి పైగా ఎంపీలుగా బరిలోకి దిగనున్నారట. మంత్రులు ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే… ఈ సారి ఆ అవకాశం మాకు వస్తుందని సీనియర్లు అనుకుంటున్నారట. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*