కన్నడ నేతలకు వాస్తు, గ్రహ దోషాల భయం

కర్ణాటక  నేతలకు అసలు టెన్షన్ మొదలైంది. తిధి, నక్షత్రం, వారం, వర్జ్యం, ముహూర్తాలు, వాస్తు దోషాలే ఇందుకు కారణం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీలపై నేతలు వారు ఆందోళన చెందుతున్నారు. పోలింగ్ తేదితో పాటు..ఫలితాల ప్రకటన రోజు అమావాస్య కావడంతో వారికి భయం పట్టుకుంది. గ్రహాల అనుకూలతలు లేవు…ఏం చేయాలబ్బా అంటూ జుట్టు పీక్కుకుంటున్నారు. 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయి. ఏప్రిల్‌ 17న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మే 12న పోలింగ్‌. అదే నెల 15న ఫలితాలు ప్రకటించనుంచనున్నారు. అమావాస్య రోజున ఫలితాలు ప్రకటన ఏంటంటూ కొందరు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కర్నాటక నేతలు చాలా బాగా వాస్తు, గ్రహ దోషాలను పట్టించుకుంటారు. కారుమీద కాకి వాలిందని…ఏకంగా కారునే మార్చిన ఘనత సిఎం సిద్దరామయ్యది. హెలికాప్టర్ లో మంటలు వచ్చాయని..ఏకంగా ఆ హెలికాప్టర్ నే వాడకుండా పక్కన పెట్టారాయన. ఆయనే కాదు…దేవేగౌడ్, కుమార స్వామి, గాలి జనార్దన్ రెడ్డిలు ఎక్కువగా వాస్తును నమ్ముకుంటారు. ఇప్పుడు ఎన్నికల సంఘం ప్రకటించిన రెండు రోజులు మంచివి  కావని దుశ్శకునానికి సూచికలను నేతలు అంటున్నారు. 
జ్యోతిశాస్త్రంపై మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడకు అపారమైన నమ్మకముంది. తమ పార్టీ అవకాశాలను దెబ్బ తీసేందుకు జరుగుతున్న కుట్రలలో భాగంగా ఇలా చేస్తున్నారని ఆయన అంటున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పకు జ్యోతిష్యం పై నమ్మకముంది. సీఎంగా పని చేసిన కాలంలో చేతబడికి వ్యతిరేకంగా పూజలు చేయించారాయన. సిఎం  సిద్ధరామయ్య భార్య పార్వతి మతపరమైన విషయాల్లో పూర్తిగా నియమ నిష్టలను పాటిస్తారు. భర్త, కుమారుడు విజయం సాధించాలని ఆమె ఇప్పటికే పూజలను ప్రారంభించారు. నాగా సాధువుల పాదాలను తాకితే…రాజకీయంగా తిరుగుండదని స్థానికుల భావన. అంతే  బీజేపీ నేత యడ్యూరప్ప…నాగా సాధవులను ఇంటికి తీసుకొచ్చి ఆశీర్వాదం పొందారు. ఆలయాల జెండాలను వేలంలో కొనుగోలు చేస్తే…తమకు తిరుగుండదన్న నమ్మకంతో బీజేపీ నేత జెండాలను కొనుగోలు చేయడం ఆశ్చర్యమేమి కాదు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*