ఏపీకి క్యూకట్టనున్న కేంద్ర మంత్రులు

బీజేపీ కూటమికి టీడీపీ గుడ్ బై చెప్పింది. తప్పు అంతా బీజేపీ పైనే వేసింది. ఏపీకి అన్యాయం చేస్తోంది కేంద్రం. అందుకే బయటకు వచ్చామనిచెప్పింది. ఫలితంగా విమర్శలను కడుక్కోవడం బీజేపీ వంతు అయింది. ప్రజల దృష్టిలో బీజేపీ ఇప్పుడు విలన్. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తాము అంత ఇచ్చాం. ఇంత ఇచ్చామని చెప్పుకోవడం తప్ప ఏం చేయలేకపోతోంది. ఏపీకి హోదా ఇవ్వనంత కాలం ప్రజలు ఆ పార్టీని నమ్మేలా లేరు. అందుకే చంద్రబాబు ఏం చెప్పినా నిజమని నమ్మే పరిస్థితి వచ్చింది. 
అందుకే బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. తాము ఏపీకి ఏం చేశామో చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులను ఏపీకి పంపించే ఆలోచన చేస్తోంది. ఇందుకు కార్యాచరణ రూపొందుతోంది. కేంద్రమంత్రులు రాష్ట్రానికి రావడంతో పాటు వాళ్లు ఇక్కడ ఏం మాట్లాడాలనే విషయాన్ని బీజీపే నేత రాంమాధవ్ పర్యవేక్షిస్తున్నారు. ఏపీకి ఏమి ఇవ్వకుండా అక్కడకు వెళ్లి ఏం చెప్పాలనే విషయం పై బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసింది. టీడీపీ ప్రభుత్వం తాము ఇచ్చిన వాటిని ఎలా వాడుకోలేకపోయిందనే విషయాలను కేంద్రమంత్రులతో చెప్పించనుంది బీజేపీ. ప్రజల్లో తమపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 
చంద్రబాబు పాలన అద్భుతం అన్న నోటితోనే ఆయన అన్ని రకాలుగా మోసం చేశాడని చెప్పాల్సి వస్తోంది. ఇది కొందరు బీజేపీ నేతలకు ఇష్టం లేదు. అయినా సరే పార్టీ స్టాండ్ అలానే ఉంది. కేంద్ర మంత్రి గడ్కరీ ఇలానే ఏపీకి రావాల్సి ఉండగా..వాయిదా వేసుకున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటం ఇష్టం లేకనే ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారంటున్నారు. ఆయనే కాదు..చాలామంది మంత్రులు టీడీపీతో పొత్తు తెగిపోయిన తర్వాత ఏపీలో పర్యటించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వచ్చే నెలలో ఏపీలో కేంద్రమంత్రుల పర్యటనలు ఎక్కువగా ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాము ఏం చేశామనే విషయాన్ని కేంద్రమంత్రుల ద్వారా చెప్పించనుంది బీజేపీ. 
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఐదుగురు కేంద్ర మంత్రులతో ఇప్పటికే మాట్లారని..రాష్ట్రానికిసంబంధించిన సమాచారం అంతా ఇచ్చారంటున్నారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*