హస్తినకు చంద్రబాబు

ఏపికి జరుగుతున్న అన్యాయం పై హస్తిన స్థాయిలో ధ్వజమెత్తేందుకు సిఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. జాతీయ స్థాయి నేతలను కలిసి తమ వాదన బలంగా వినిపించనున్నారు. వీలున్నంతగా కేంద్రం పై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి న్యాయం జరిగే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ వంటి నేతలు ఢిల్లీకి చేరి…వివిధ పక్షాలతో మాట్లాడుతున్నారు. ఆమె చంద్రబాబు ప్రంట్ లో ఉంటారా..లేక కేసీఆర్ ప్రంట్ లో ఉంటారా తేలలేదు. మరోవైపు కాంగ్రెస్ నేతలతోను ఆమె బాగానే మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఎవరితో మాట్లాడతారు. ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 
ముచ్చటగా 30వ సారి ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు ఏప్రిల్ 2,3 తేదీల్లో విపక్షాలతో భేటి అయ్యే వీలుంది. తాము పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మద్దతివ్వాల్సిందిగా కోరే అవకాశముంది. అదే సమయంలో యునైటెడ్‌ ఫ్రంట్‌పై ఏకాభిప్రాయం తెచ్చేందుకు ప్రయత్నించవచ్చు. కాకపోతే కొందరు ఎంపీలు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడి నేతలంతా ఎన్నికల హడావుడిలో ఉన్నారు. అంతగా పోకస్ రాదనే భావన వ్యక్తం చేస్తున్నారు. అన్యాయం జరిగినప్పుడు ఢిల్లీకి వెళ్లకపోతే కష్టమనే ఆలోచన చేస్తున్నారు మరోవైపు చంద్రబాబు. 
ఇంకోవైపు చంద్రబాబు ఎప్పుడు వస్తారు. ఎవరిని కలుస్తారు..వారు ఎంత వరకు హామీనిస్తారనే అంశం పై బీజేపీ ఆరా తీస్తోంది. డిల్లీలో జరిగే చంద్రబాబు ప్రతి కదలికపైనా దృష్టి సారిస్తోంది. అసలు కేసీఆర్ ప్రంట్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారు తప్ప నిజం కాదంటున్నారు. మరోవైపు శరద్ పవార్ లాంటి నేతలు హస్తినలో చంద్రబాబును కలిసి యుపిఏ కూటమిలోకి రావాల్సిందిగా కోరే వీలుంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*