అజ్ఞాతవాసికి జేపీ దూరం

బంధం తెగిపోయింది. మూడు నాళ్ల ముచ్చట అయింది. జేపీ, జనసేనకు అప్పుడే విభేదాలొచ్చాయి. జేఎప్సీ నుంచి జేపీ బయటకొచ్చారు. అసలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏ విషయం పైనా అవగాహన లేదని చెప్పారు. అంతే పవన్ కల్యాణ్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తానో మేధావిలా అతను ఫీలవడం తప్ప..విషయం లేదనే వాదన తెరపైకి వచ్చింది. ఏ విషయం పైనా అయినా ఇతరుల మీద ఆధారపడటం తప్ప పవన్ కల్యాణ్ కు ఏం చేయాలో తెలియడం లేదు. కాసేపు కేంద్రాన్ని తిడతారు. తర్వాత అదే బాగా పరిపాలన చేసిందంటారు. మరికాసేపు చంద్రబాబుు, కేసీఆర్ ను పొగుడుతారు. ఆ తర్వాత అంత అవినీతి ప్రభుత్వాలు లేవంటారు. మొత్తంగా తాను ఏం చేయాలో ఏం చేస్తున్నాడో తనకే కాదు..జనసేనకు తెలియడం లేదు. 
సుంకర దిలీప్ వంటి వారు అప్పుడే బయటకు రావడం, జయ ప్రకాష్ నారాయణ లాంటి వారు పవన్ కల్యాణ్ తీరుకు నొచ్చుకోవడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. సినిమాలో నటించినంత తేలికగా రాజకీయాలను తీసుకున్నారు పవన్. అందుకే పార్టీ పూర్తిగా పట్టాల మీదకు ఎక్కకుండానే ఢమాల్ మని పడ్డారు. అప్పుడప్పుడు ఆవేశంగా మాట్లాడటం ఆ తర్వాత అపరిచితుడులా ఉండటం అజ్ఞాతవాసిగా మాములు వ్యవహారమైంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. అనంతపురంలో  రైతుల్ని, చేనేత కళాకారుల్ని కలిశారు పవన్. వారిని త్వరలో ప్రధాని మోడీ వద్దకు తీసుకెళ్తానన్నారు. ఆ తర్వాత మర్చిపోయారు. జిల్లాల వారీగా పార్టీ శిబిరాలను నిర్వహించారు. ఆ తర్వాత వాటి సంగతిని పక్కన పెట్టారు. ఒంగోలులో చాలా హామీలే ఇచ్చారు. వాటిని మర్చిపోయారు. హోదా కోసం గుంటూరు వెళ్లారు..బంద్ చేస్తానన్నారు. ఆ పని చేయలేదు. ఆమరణ దీక్ష అన్నారు. ఆ ఊసు లేదు. అవిశ్వాస తీర్మానం పెట్టండి. అన్ని పార్టీలతో మాట్లాడతానన్నారు. ఆ పని చేయలేదు. అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కాదు. 
చేతగానప్పుడు మాట్లాడటం ఎందుకు. అలా మాట్లాడకుండా ఉంటే పరువైనా ఉండేదిగా అంటున్నారు జనాలు. ప్రజారాజ్యం పార్టీ కంటే తక్కువ రోజుల్లోనే జనసేనను పేకప్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అజ్ఞానం అంతా రోడ్డు మీద పడిపోతుందనే వాదన లేకపోలేదు. విభజన హామీలు, ప్రత్యేకహోదా కోసం కేంద్రం నుంచి బోల్డన్నీడబ్బులు రావాలని కోరారు. హోదా సంగతి పక్కన పెట్టారు. ఆ మాత్రం మాట్లాడేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తాను అలా అనలేదని బుకాయించారు. టీవీలో ఆయన మాటల్లో స్పష్టత ఉందని అంతా ప్రచారం అయింది. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే పవన్ కు తిక్క ఉందంటున్నారు. కానీ దానికి లెక్క లేదని తేలిపోతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*