రాజకీయ నాలుక ఎలా తిరుగుతుందో చూడు…

ఏపీలో భయంకరమైన అవినీతి జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. బీజేపీ నుంచి టీడీపీ దూరం కావడంతో అంత అవినీతి ఆయనకు కనపడింది. ఇన్నాళ్లు ఆ మాట చెప్పలేదు. ఏదో నామమాత్రంగా విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయి కదండి. అందుకే అంతగా ఆయన నోరు జారుతున్నారు. కర్నూలులో పర్యటించిన సోము వీర్రాజు టీడీపీపై నిప్పులు చెరిగారు. ఎంతగా అంటే… ఏపీలో టీడీపీ ప్రభుత్వ అవినీతిని తవ్వడానికి గునపాలు చాలడం లేదట. బుల్ డోజర్ లు కావాలని సెలవిచ్చారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డ్రామా పార్టీగా కనపడింది. 
కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో 90 యంత్రాలు పని చేయడం లేదు. యంత్రాలు పని చేయకపోయినా సీఎం డాష్ బోర్డులో పనిచేస్తున్నట్లు నమోదైంది. టీబీఎస్‌ సంస్థ పరికరాల మెయింటెనెన్స్ బాధ్యతలు టెండర్ ద్వారా తీసుకుంది. టీబీఎస్‌కు ఎక్కడా లేని విధంగా రూ.103 కోట్లు మొబిలైజేషన్‌ ద్వారా, బిల్లుల రూపేనా రూ.45 కోట్లు చెల్లించారు. ఓ మంత్రి గారి బంధువు ఈ కాంట్రాక్టును దక్కించుకున్నారు. అందుకే ఆయన వారిపై విరుచుకుపడ్డారంటున్నారు. కర్నూలు బీజేపీ నేతలు చెప్పారు సోము వీర్రాజు చెప్పారు. అంతే పెద్దగా అక్కడి విషయాలు ఆయనకు తెలిసినట్లు లేదు. టీడీపీని తిట్టాలి కాబ్టటి తిట్టారని అర్థమవుతోంది. 
నారాయణ…నారాయణ….
ఏపీ అభివృద్దికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ అడ్డుపడుతోందని ఇప్పటి వరకు టీడీపీ నేతలు చెప్పే మాట. అది వినీ వినీ అందరికీ బోర్ కొట్టింది. అందుకే మంత్రి నారాయణ కొత్తి పల్లవి అందుకున్నారు. వైకాపానే కాదు… జనసేన, బీజేపీలు అభివృద్ధి నిరోధక పార్టీలట. ఏపి అభివృద్దికి బీజేపీ, వైసీపీ, జనసేన సైందవుల మాదిరి అడ్డుపడుతున్నాయని తిట్టేశారు. ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుంటే ఈ మూడు పార్టీలు ఏపీకి అన్యాయం చేస్తున్నాయట. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాజధాని పనులు ఆగవని చెప్పారు. రాజధాని నిర్మాణానికి రూ.లక్ష తొమ్మిది వేల కోట్లు అవసరమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఇప్పటికి రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. 
నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగింది టీడీపీ. వారు ఏం చెబితే దానికి తలూపింది టీడీపీ. హోదాపై రకరకాలుగా మాట్లాడింది. హోదా కోసం పోరాటం చేస్తుంటే అణిచి జైల్లో పెట్టించింది. కానీ ఇప్పుడు హోదా కోసం తామే పెద్ద పోరాడుతున్నట్లు కలర్ ఇస్తోంది. అంటే ఇన్నాళ్లు ఆయా పార్టీలు చేసేది తెలియలేదేమో. నోరు ఉంది కదాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటున్నారు మరోవైపు జనాలు.  
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*