కేసీఆర్ భ‌యం నుంచి ఫ్రంట్ పుట్టిందా!

ఎంపీగా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది.. ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ల‌క్ష‌లాది మంది పాల్గొన్నారు. చెన్నారెడ్డి, జ‌య‌శంక‌ర్‌, కోదండ‌రం మాస్టారు ఎంద‌రో ఉద్దండులు ఉద్య‌మాన్ని న‌డిపించారు. కానీ.. క్రెడిట్ మాత్రం కేసీఆర్ ద‌క్కించుకున్నారు. పాల‌న ప‌గ్గాలు చేతికి రాగానే బంగారుతెలంగాణ సాధ‌న అంటూ సెంటిమెంట్ మొద‌లుపెట్టారు. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీల‌ను ద్రోహులుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. మీడియా వ్య‌తిరేక‌త‌కు బ్యాన్ అంటూ మొద‌ట్లోనే హెచ్చ‌రించి అమ‌లు చేశారు. తెలంగాణ వ్య‌తిరేకులుగా ముద్ర‌వేసి.. మీడియా నెగిటివ్‌గా గొంతెత్తితే పీక నులిమేస్తామ‌నే సంకేతాలు పంపారు. దీంతో.. కేసీఆర్ ఆహా.. కేసీఆర్ కొడుకు, కూతురు.. ఓహో అంటూ.. ఊద‌ర కొట్ట‌డంతోనే పొద్దు వెళ్ల‌బుచ్చాల్సిన ప‌రిస్థితి దాపురించింది. అవినీతి, అక్ర‌మాలు చెద‌పుట్ట‌లుగా పెరుగుతున్నా ఎవ‌రూ ఏం చేయ‌లేర‌నే ధైర్యం.. 2019లో మ‌ళ్లీ ఏలిక‌లు మ‌న‌మే అనే ధీమాతో కేసీఆర్ ఉన్నారంటూ ప్ర‌తిప‌క్షాల‌తోపాటు తెలంగాణ ఉద్య‌మ‌వాదులు కూడా విమ‌ర్శిస్తున్నారు. కాక‌తీయ‌, మిష‌న్‌ భ‌గీర‌థ‌, ఇండ‌స్ట్రీల ఏర్పాటు వంటి అంశాల్లో భారీగా కోట్లు ముడుపులు గుంజారంటూ బీజేపీ ఆరోపిస్తుంది. విప‌క్ష కాంగ్రెస్ నేత‌లైతే బంగారు తెలంగాణ కేవ‌లం కేసీఆర్ ఇంటికేనంటూ ఎద్దేవా చేస్తున్నారు. మ‌రోవైపు గ‌త త‌ప్పిదాల‌, అవినీతి కార్య‌క‌లాపాల‌తో బీహార్ మాజీ సీఎం లాలు ప్ర‌సాద్‌ యాద‌వ్‌, త‌మిళ‌నాట శ‌శిక‌ళ ఊచ‌లు లెక్కిస్తున్నారు. ప‌దేళ్ల‌పాటు ఆర్ధిక‌మంత్రిగా చ‌క్రం తిప్పిన చిదంబ‌రం వంటి నాయ‌కుడికీ కేసులు త‌ప్ప‌లేదు. కుమారుడు కార్తీను జైల్లో పెట్టినా నోరు మెద‌ప‌లేని స్థాయికి చేరారు. క‌ళ్లెదుట ఇన్ని క‌నిపిస్తుండ‌టంతో కేసీఆర్‌లో భ‌యం చోటుచేసుకుంద‌నే అభిప్రాయం మొద‌లైంది. ఎంత రాష్ట్ర నేత అయినా.. కేంద్రానికి లోకువే. చ‌ట్టాలు, అధికారులున్న వారు క‌న్నెర్ర చేస్తే బ‌య‌ట‌ప‌డ‌టం క‌ష్ట‌మే అనేది వైసీపీ నేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఉదంత‌మే ఉదాహ‌ర‌ణ‌. తాను కాంగ్రెస్‌లో కొన‌సాగిన‌ట్ల‌యితే ఈ కేసులు, సీబీఐ ద‌ర్యాప్తులు ఉండేవి కాదంటూ స్వ‌యంగా జ‌గ‌న్ అంగీక‌రించారు. ఢిల్లీ గ‌ద్దెకు వున్న ప‌వ‌ర్‌ను కాద‌ని తానేమీ చేయ‌లేమ‌నేది కేసీఆర్ అంత‌రంగం. అందుకే.. ఏదోలా.. కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేయ‌ట‌మో.. కాద‌ని.. మ‌రో కుంప‌టి పెట్ట‌డ‌ం చేయ‌టం ద్వారా త‌న ఉనికికి ప్ర‌మాదం ఉండ‌ద‌నే ఆలోచ‌నే మూడోకూట‌మి ఏర్పాటుకు అస‌లైన కార‌ణం కావ‌చ్చ‌నేది రాజ‌కీయ మేధావులు విశ్లేష‌ణ‌. అయితే మ‌మ‌తాబెన‌ర్జీ నుంచి మద్దతు అనుకుంటే.. ఆశాభంగ‌మే ఎదుర‌వ‌టం.. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు కూడా మ‌రో కూట‌మి కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించ‌టంతో కేసీఆర్ మ‌ళ్లీ మోదీ ఎదుట మౌనంగా నిల‌బడాల్సి వ‌చ్చింద‌న్న‌మాట‌. అందుకే.. ఏపీకు హోదా కోస‌మే త‌మ మ‌ద్ద‌త‌ని.. అవిశ్వాసం అనే ప్ర‌స‌క్తే లేదంటూ ప్లేటు ఫిరాయించారు. తెలుగోడంటే.. తెలంగాణ‌, ఆంధ్రా కాద‌ని.. ఎంపీలు బ‌హిరంగంగానే కామెంట్స్ చేయ‌ట‌మే కేసీఆర్ ఫిరాయింపు స్వ‌రానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*