మళ్లీ పార్టీ మారే ఆలోచనలో జీవిత రాజశేఖర్

పిల్లి పిల్లలను మార్చినంత తేలికగా జీవిత, రాజశేఖర్ లు పార్టీలు మార్చారు. అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీలో సెటిలయ్యారు. కానీ ఇప్పుడు ఆ పార్టీలోను ఉండనంటున్నారట. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీలను చూశారు వాళ్లు. చివరకు సెన్సార్ బోర్డు సభ్యురాలిగా జీవితను నియమించడంతో భాజపాలో ఉండిపోయారు. ఇప్పుడు అక్కడ నుంచి బయటపడతారట. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై విమర్శలు వస్తున్నాయి. అందుకే ఆ పార్టీలో ఉంటే తనకు ఇబ్బంది అని భావిస్తున్నారని తెలుస్తోంది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో జీవిత మంతనాలు జరిపారు. తాను టీడీపీలోకి వస్తానని చెప్పారు. అదే సమయంలో హైదరాబాద్ పరిసరాల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వాలని కండీషన్ పెడుతున్నారు. 
తెలంగాణలో టీడీపీకి కార్యకర్తలు ఉన్నా.. నేతలు లేరు. కాబట్టి జీవితరాజశేఖర్ లను ఆహ్వానించే అవకాశం ఉంటోంది. మల్కాజ్ గిరి టిక్కెట్ తనకు ఇవ్వాలని కోరుతున్నారట జీవిత. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఏమంటారో.. అసలు ఒప్పుకుంటారో లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టీడీపీని తిట్టిపోయిన జీవిత రాజశేఖర్ లు తిరిగి వస్తారా అనేది ఆసక్తికరమే. చిరంజీవిని దారుణంగా తిట్టిన జీవిత రాజశేఖర్ లు ఆ తర్వాత ఆ కుటుబంతో సంబంధాలను పునరుద్దరించుకుంది. ఇప్పుడు అంతే. టీడీపీ కాకపోతే ఇంకో పార్టీ అన్న చందాన వ్యవహరిస్తున్నారు వాళ్లు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*