నిరాధార విమర్శలు పవన్‌కు తగవు : బుచ్చి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పరిపాలన, ప్రభుత్వంలో అవినీతి, ప్రత్యేకించి.. మంత్రి నారా లోకేష్ అవినీతి మీద ఏమాత్రం ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం అనేది.. పవన్ కల్యాణ్ వంటి ప్రజాదరణ ఉన్న వ్యక్తికి భావ్యం కాదని.. ఏపీఎన్ఆర్‌టీ చీఫ్ కోఆర్డినేటర్ బుచ్చి  రాం ప్రసాద్ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మహాసభలో చేసిన ప్రసంగం ఎన్నారై వర్గాల్లో కూడా తీవ్ర ప్రకంపనాలు సృష్టిస్తోంది. పవన్ కల్యాణ్ రాజకీయ పోకడలు, ఆయన ప్రస్థానం వేస్తున్న అడుగులు లేవనెత్తుతున్న ప్రజా సమస్యల మీద.. ఇన్నాళ్లూ సానుకూలంగానే వ్యవహరిస్తున్న ఎన్నారై తెలుగు ప్రజలు.. పవన్ బుధవారం నాడు చేసిన ప్రసంగంతో ఒక్కసారి నివ్వెర పోయారని.. పవన్ హఠాత్తుగా ఎందుకు ఇలా దారితప్పిపోయారో అర్థం కావడం లేదని బుచ్చి రాంప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబానయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి చేస్తున్న కృషిలో భాగంగా.. ఎదురవుతున్న అన్ని సవాళ్లను దాటుకుంటూ ముందుకు వెళ్తోంటే.. రాష్ట్రంకోసం తపించే వ్యక్తిగా.. ఆ ప్రభుత్వానికి సహకరించాల్సింది బదులుగా.. పవన్ కల్యాణ్ కూడా.. సాక్షి దినపత్రికలో వస్తున్న నిరాధార, ఎలాంటి సాక్ష్యాలు లేని రాతలను నమ్మి.. ప్రభుత్వం మీద  బురద చల్లే వైఖరి మంచిది కాదని అన్నారు.

లోకేష్ మీద ఇలాంటి సాక్ష్యాలు లేని.. వైసీపీ బ్రాండ్ ఆరోపణలను బాధ్యతగల పార్టీ అధినేతగా వేదిక మీదినుంచి ప్రకటించేప్పుడు పవన్ మరోసారి పునరాలోచించుకుని ఉండాల్సిందని బుచ్చి రాంప్రసాద్ సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగనివ్వకుండా అనేక రకాలుగా అడ్డం పడుతున్న వైకాపా నాయకులకు, మీకు ఏంటి తేడా…? అంటూ పవన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు.

కేవలం ఇలాంటి పసలేని ఏకపక్ష వాదనలే వినిపించేట్లయితే గనుక.. పవన్ కల్యాణ్ ఓ ప్రెస్ మీట్ పెడితే సరిపోయేదని.. ఇంత భారీ ఖర్చుతో పార్టీ ప్లీనరీ ఆవిర్బావ సభ అంటూ ఇంత హడావిడి అనవసరం అని బుచ్చి పేర్కొన్నారు.

పవన్ అసమంజసమైన వ్యాఖ్యలను ఎన్నారై తెలుగుసమాజం మొత్తం ఖండిస్తున్నదని బుచ్చి రాంప్రసాద్ చెప్పారు. పవన్ కు అమెరికాలో మంచి ఫాలోయింగ్ ఉందని, ఇండియాలో అట్టర్ ఫ్లాప్ అయిన ఆయన చిత్రాలకు కూడా అమెరికాలో మంచి ఆదరణ ఉంటుందని, అలాంటి ఇక్కడి తెలుగు వారు.. ఎలాంటి సహేతుకత లేని ఆయన రాజకీయ ప్రసంగాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

పవన్ కు వైసీపీ ని అధిగమించి రాష్ట్రంలో నెంబర్ టూ పార్టీగా ఎదగాలనే కోరిక ఉండడంలో తప్పు లేదు గానీ.. అందుకు నైతికమైన సహేతుకమైన మార్గాలు అనేకం ఉన్నాయని… ఇలా విలువలు లేకుండా.. అసంబద్ధ ఆరోపణలు చేయడం సరికాదని అంటున్నారు. పవన్ వైఖరి, మసిగుడ్డ కాల్చి మొహాన పడేసి.. మీరే తుడుచుకోండి అన్నట్లుగా ఉన్నదని బుచ్చి రాంప్రసాద్ దెప్పిపొడిచారు.

2 Comments

  1. At least it is tolerable. Now a days something different is happening in Delhi. A new mad dog is barking daily imitating the style and mode of the infamous ADOLF Hitler and his infamous propaganda minister Goebbels.The two Germans are feeling proud that their inheritors are continuing their unfinished job now. One is feeling shy of opening channels.

Leave a Reply

Your email address will not be published.


*