బీజేపీ-వైకాపా రహస్య ఒప్పందం…

బీజేపీ – వైసీపీ మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందాలు జ‌రుగుతున్నాయ‌నే వాదన సాగుతోంది. ప్రధాని మోడీ, వైకాపా అధినేత జగన్ మధ్య విజయసాయిరెడ్డి వారధిగా పని చేస్తున్నారని టీడీపీ అంటోంది. పైకి అవిశ్వాస తీర్మానం పెడుతూనే లోపల బీజేపీకి అనుకూలంగా చర్చలు జరుపుతుందంటున్నారు. మరోవైపు కేంద్రం చర్యలు అలానే ఉన్నాయి. వైసీపీ ఎంపీలు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయ‌ల్ తో భేటీ అవ్వ‌డం పలు సందేహాలకు తావిచ్చింది.  బీజేపీ – టీడీపీ లు భాగస్వామ్య పార్టీలు. ఇప్పటికీ టీడీపీ ఎన్డీఏ భాగస్వామినే. బీజేపీ ఏం చేసిందో చెప్పాల‌ని టీడీపీ ప్ర‌శ్న‌ించడం, కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల‌తో రాష్ట్రాన్ని అభివృద్ధిని చేసుకునే పని చేస్తున్నారు చంద్రబాబు. అదే సమయంలో అభివృద్ధి క్రెడిట్ ను  టీడీపీ త‌న అకౌంట్లో వేసుకుంటోంది. దీనిపై బీజేపీ గుర్రుగా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా టీడీపీతో గుడ్ బై చెప్పి వైసీపీతో స్నేహం చేయాల‌ని బీజేపీ భావిస్తోంది. అందుకే కేంద్రంలో కొన్ని కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ – బీజేపీ స్నేహ‌బంధం ఖాయ‌మ‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి.
ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో బీజేపీ-వైకాపా తీరును సిఎం చంద్రబాబు తప్పు పడుతున్నారు. కేంద్రం ఏ నిర్ణ‌యం తీసుకున్నా త‌మ‌కంటే ముందుగా వైసీపీకి ఎలా తెలుస్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ అని వైసీపీ నేత విజయ సాయి రెడ్డికి ముందే తెలిసింది. అందుకే బీహార్ గవర్నర్‌గా ఉన్నప్పుడే వెళ్లి కలిశారని ఆరోపించింది. బీజేపీ – వైసీపీ బంధం గురించి చంద్ర‌బాబు చేస్తున్న ఆరోప‌ణ‌లు నిజ‌మ‌య్యేలా ఉన్నాయి పలు ఉదంతాలు. 
ఏపీకి రైల్వే జోన్ గురించి మాట్లాడేందుకు టీడీపీ ఎంపీలు కేంద్రం  రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో అనుమతి కోరారు. కానీ వారికి అపాయింట్మెంట్  ఇవ్వలేదు. మంత్రి. కానీ వైసీపీ తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో రైల్వే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలని కోరుతూ పియుష్ గోయ‌ల్ కు విన‌తి ప‌త్రాలు ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పియూష్ గోయల్  కోసం టీడీపీ ఎంపీలు ప్రయత్నిస్తే వైకాపా ఎంపీ ఇలా వచ్చి అలా వెళ్లారు. ఉద్దేశపూర్వకంగానే టీడీపీ ఎంపీలకు ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను రద్దు చేసి, వైసీపీ ఎంపీకి అపాయింట్‌మెంట్ ఇచ్చారనే అనుమానం వ్యక్తమవుతోంది. రాబోయే కాలంలో కాబోయే భాగస్వామ్య పార్టీ అనే ఆలోచన చేశారట కేంద్ర మంత్రి. అందుకే టీడీపీని ప్రయార్టీ ఇవ్వకుండా వైకాపాకు ఇచ్చారంటున్నారు. టీడీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా కేంద్రం చేతలు ఉంటున్నాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*