హ‌రీష్‌.. మ‌రీ అలాంటోడా రేవంత‌న్నా!

గులాబీ స‌ర్కారుపై రేవంత్ మాట‌ల దాడి పెంచాడు. కేసీఆర్ కుటుంబాన్ని ల‌క్ష్యంగా చేసుకుని.. చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. ఊహించని విధంగా.. కాంగ్రెస్ నేత‌ల‌పై స‌స్పెన్ష‌న్ వేటు.. ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌పై స‌భ్య‌త్వ ర‌ద్దుతో కాంగ్రెస్ శ్రేణులు.. స‌మ‌రానికి సిద్ధ‌మ‌య్యాయి. తాడో.. పేడో తేల్చుకునేందుకు.. ఘ‌ట‌న‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకుని రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం పొందేందుకు అవ‌కాశాలు వెతుకుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌కు వ‌ల‌స వ‌చ్చిన రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ కుటుంబంపై ఊహించ‌ని విధంగా కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్  ఆరోగ్యం స‌రిగాలేని స‌మ‌యంలో.. ఆయ‌న అమెరికాలో వైద్య‌చికిత్స పొందిన విష‌యాన్ని గుర్తు చేశారు. పైగా.. అమెరికాలో వున్న కేసీఆర్‌.. అట్నుంచి అటు పోతారంటూ ప్ర‌చారం చేసి సీఎం కుర్చీ కోసం ఆరాట‌ప‌డిన వారిలో.. కొడుకు, అల్లుడూ ఉన్నారంటూ ఆరోపించారు. పైగా.. ఈ ప్ర‌చారాన్ని బ‌య‌ట‌కు పంపి.. ల‌బ్ది పొందాల‌ని చూసింది కూడా.. వారేనంటూ ఎద్దేవా చేశారు.  హ‌రీష్‌రావును ఉద్దేశించి ఒక స‌ల‌హా కూడా ఇచ్చారు. పొడ‌వుగా ఉన్నానంటూ పొంగిపోయే.. హ‌రీష్ న‌డుం విర‌గ్గొట్టేందుకు.. కేటీఆర్‌, కేసీఆర్ సిద్ధంగా ఉన్నారంటూ సూచ‌న చేశారు. పైగా.. చేప‌ట్టిన అభివృద్ధి ప‌నుల్లో యాభై శాతం పాపాలున్నాయంటూ చిట్టా చ‌దివారు. రేవంత్ చేసిన కామెంట్స్‌పై.. గులాబీ బాసు ఇంత వ‌ర‌కూ నోరు విప్ప‌లేదు. దీనిపై హ‌రీష్‌, కేటీఆర్, క‌విత వ‌ర్గాల్లో మాత్రం ర‌స‌వ‌త్త‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంద‌ట‌. రేవంత్ అడిగిన లాజిక్ బాగానే ఉన్నా.. మ‌రీ మ‌న హ‌రీష్‌రావు సారు.. అలాండోంటారా అనుకుంటున్నార‌ట‌. పోన్లే.. ఏదైతేనేం.. ఇప్ప‌టికే పాపం.. కేటీఆర్‌కు ప్రాముఖ్య‌త‌నిస్తున్న‌.. కేసీఆర్ ఈ దెబ్బ‌కు.. హ‌రీష్‌ను మ‌రింత దూరం పెడ‌తార‌నే ప్ర‌చారం మొద‌లైంది. ఏది ఎలా వున్నా.. రేవంత్‌, హ‌రీష్‌రావు మ‌ధ్య మొద‌లైన మాట‌ల‌యుద్ధం.. ఇంకెతటి ప‌రిస్థితికి దారితీస్తుంద‌నేది  ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*