పవన్ భయపడుతున్నాడా… భయపెడుతున్నాడా…

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు భయం వేస్తుందా లేక ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నారా అనే అనుమానం వస్తోంది. పార్టీ ఆవిర్భావ సభకు ముందుగానే ఏపీ డీజీపీ మాల‌కొండ‌య్య‌కు లేఖ రాశారు పవన్. గుంటూరులో జ‌రిగే జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా త‌న‌కు భద్రత క‌ల్పించాల‌ని కోరారు. స‌భ త‌రువాత కూడా త‌నకు భ‌ద్ర‌త కొన‌సాగించాల‌ని విన్నవించుకున్నారు. వాస్తవంగా పవన్ తో పాటు.. ఎప్పుడూ బౌన్సర్లు ఉంటారు. వారి సంఖ్య మిగతా వారి కంటే ఎక్కువగానే ఉంటోంది. ఎక్కడ సభ జరిగినా వారిని తీసుకెళ్లడం కొత్తేం కాదు. కాకపోతే ఈసారి కొత్తగా సెక్యూరిటీ అడగడటమే ఆశ్చర్యంగా ఉంది. స‌భ జ‌రుగుతుంద‌నే ఉద్దేశంతో తాము సెక్యూరిటీని కోర‌డం లేద‌ని ప్ర‌జా స‌మ‌స్య దృష్ట్యా భ‌ద్ర‌త కొన‌సాగించాల‌ని కోరుతున్న‌ట్లు ప్రస్తావించారు. 
తెలుగురాష్ట్రాల్లో కొన్ని స‌భ‌లు నిర్వ‌హించిన‌ప్పుడు భ‌ద్ర‌త స‌మ‌స్య త‌లెత్తింద‌ని గుర్తు చేశారు. తనపై దాడి జరిగితే ప్రజా జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని చెప్పారు. గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ లేఖ రాశారు. భీమవరంపట్నంలో తన ఫ్లెక్సీని చించేసినందుకు ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది. దీంతో అభిమానుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌ు. కాకినాడ, విజయవాడలోను, ఉద్దానంలోను ఇదే సీన్. సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయిన ప్ర‌తీసారి దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించి ప్రజలు ఇబ్బంది పడ్డారని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావ‌  స‌భ, ఆ త‌రువాత భ‌ద్ర‌త‌ను కొనసాగించాల‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. 
రాష్ట్ర‌ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా త‌న‌పై దాడి జ‌రిగితే అందుకు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వహించాల‌ని అనడం హాట్ టాపికైంది. తన వినతిని సానుభూతితో పరిశీలించాలని, తన విన్నపాన్ని మన్నించాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పవన్ చెప్పడం తప్ప ఏం చేయలేక పోయారు. ప్రజల వద్దకు వెళ్లి అధికార పార్టీలు బాగా పని చేస్తున్నాయని కితాబునివ్వడం తప్ప పవన్ చేసింది లేదు. కీలక సభలో పార్టీ భవిష్యత్ ప్రణాళికను ప్రకటించే వీలుంది పవన్. అదే సమయంలో తమపై వస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పే వీలుంది. ఇవాళ చెప్పింది. రేపు కాదంటారు పవన్. హోదా కోసం తీర్మానం పెట్టండి. నేను అందరినీ కూడగడతానని పెద్ద వీరుడిలా పోజు ఇచ్చారు. ఆచరణలో ఆపని చేయలేక పోయారనే విమర్శ ఉంది. వైకాపా ముందు ఒకటి. వెనుక ఒకటి చేస్తోంది. అందుకే మద్దతు ఇవ్వలేక పోయానని చెప్పే వీలుంది. విషయం ఏదైనా కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*