ఈ ద‌ర్శ‌కుల‌కు.. ఓ హిట్ కావాల‌ట‌!

తెలుగు చిత్ర‌సీమ‌లో ప్ర‌స్తుతం ఐదోత‌రం హ‌వా న‌డుస్తుంద‌నే చెప్పాలి. చ‌క్ర‌పాణి, ఆదుర్తి సుబ్బారావు అన‌ంత‌రం బాపు, విశ్వ‌నాథ్‌.. క్ర‌మంగా రాఘ‌వేంద్ర‌రావు, త‌మ్మారెడ్డి, కోదండ‌రాంరెడ్డి.. క్ర‌మంగా అది కాస్తా.. వినాయ‌క్‌.. రాజ‌మౌళి.. శ్రీనువైట్ల‌.. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌.. ఇలా మ‌రోత‌రం  వెండితెర‌ను ఏలుతుండ‌గానే.. హ‌రిశంక‌ర్‌, సురేంద‌ర్‌రెడ్డి ఇలా కొత్త ర‌క్తం ప‌ర‌వ‌ళ్లు తొక్కుతుంది. అయితే.. ఈ మ‌ధ్య‌న ఒక‌ప్పుడు.. హిట్‌లు కొట్టిన ద‌ర్శ‌కులంతా.. ఇప్పుడు బాక్సాఫీసు వ‌ద్ద బోల్తాకొట్టి.. ఒక్క సూప‌ర్‌హిట్ వ‌స్తే చాల‌నుకుంటున్నారు. అదృష్టం కోసం  ఎదురుచూసేంత వ‌ర‌కూ వెళ్లారు.. వారిలో శ్రీనువైట్ల‌, వి.వినాయ‌క్‌, పూరి జ‌గ‌న్నాథ్‌, త్రివిక్ర‌మ్‌, శ్రీకాంత్ అడ్డాల‌, కృష్ణ‌వంశీ వంటి పెద్ద ద‌ర్శ‌కుల‌కు.. ఇప్పుడొక హిట్ చాలా అవ‌స‌రంగా మారింది. శ్రీనువైట్ల‌.. ఒక‌ప్ప‌డి హిట్స్ నుంచి వ‌రుస‌గా ప‌రాజ‌యాల‌తో న‌ష్టాలు చ‌విచూస్తున్నాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ఖాతాలో కూడా టెంప‌ర్ త‌రువాత ఆశించిన సినిమా లేద‌నె చెప్పాలి. త్రివిక్ర‌మ్‌.. అజ్ఞాత‌వాసి ఫెయిల్యూర్‌తో అజ్ఞాతంలోకి చేరారా అనిపిస్తుంది. వినాయ‌క్‌.. ఇంటిల్‌జెంట్ ఘోర‌ప‌రాజ‌యంతో మంచి క‌థ‌ల కోసం ఎదురుచూడాల్సి వ‌స్తోంది. గాల్లో కార్ల‌ను ఎగ‌రేయడం వ‌దిలేసి.. క‌థ‌ల‌ను న‌మ్ముకోవాల‌నుకుంటున్నాడ‌ట‌. శ్రీకాంత్ అడ్డాల‌.. బ్ర‌హ్మోత్స‌వం ప‌రాజ‌యంతో అడ్ర‌స్ లో లేకుండా పోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కృష్ణ‌వంశీ తీసిన‌.. గోవిందుడు అంద‌రివాడే, న‌క్ష‌త్రం అట్ట‌ర్‌ప్లాప్‌ల‌తో విజ‌యం కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా చూస్తున్నాడ‌ట‌. హ‌రీష్‌శంక‌ర్ కూడా మ‌రో గ‌బ్బ‌ర్‌సింగ్ వంటి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాడ‌ట‌. ఇక అదే వ‌రుస‌లో.. హీరోలు కూడా వున్నారు.. జై ల‌వ‌కుశ‌ను కంటిన్యూ చేసేందుకు ఎన్‌టీఆర్ కూడా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఫిదా, తొలిప్రేమ‌తో హ్యాట్రిక్ కోటా కోసం వ‌రుణ్ తేజ్ క‌థ కోసం వెతుకుతున్నాడ‌ట‌. సో.. హీరోల క‌ల నెర‌వేరాలంటే.. ద‌ర్శ‌కుల‌కూ మంచి క‌థ‌.. హిట్ కొట్టాల‌నే ఆలోచ‌న కూడా ఉండాల‌ని తెలుగు సినీవ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*