అరెరె… చాన్స్ మిస్ అయిందంటున్న వైకాపా ఎమ్మెల్యేలు

ఏపీలో ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ సీట్లకు గాను.. రెండు సీట్లల్లో టీడీపీ పోటీ చేస్తోంది. మరో సీటును వైకాపాకే వదిలేసింది. గట్టిగా ప్రయత్నిస్తే టీడీపీకి ఆ సీటు రావడం ఖాయం. కానీ ఆ పని చేయడం ఇష్టం లేనట్లుగా ఉంది టీడీపీ అధినేత చంద్రబాబుకు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పూర్తిగా మునిగిపోయారు సిఎం చంద్రబాబు. అందుకే మూడో నేతను నిలబెట్టి వారికి సలహాలు, సూచనలు ఇచ్చి గెలిచినా ఆరోపణలు వచ్చే వీలుంది. అసలు అభ్యర్థులను ప్రకటించక ముందే మా ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేస్తుందని వైకాపా నేతలు ఆరోపించారు. ఢిల్లీలో ధర్నాకు తీసుకెళ్లిన నేతలందరినీ గ్రూపుల వారీగా విభజించి… నేపాల్, భూటాన్ తదితర ప్రాంతాలకు తరలించారు. మరికొందరినీ ఢిల్లీలోని రిసార్ట్ లో పెట్టి వారికి కావాల్సిన సకల హంగులను సమకూరుస్తున్నారు. ఇది ఒక రకంగా వారికి కలిసొచ్చే అంశమేనంటున్నారు. కానీ ఇప్పుడు వారికి ఎంజాయ్ మెంట్ లేదు. వారంతా తిరుగు టపా కట్టడమే ఇందుకు కారణం. టీడీపీ ఇద్దరినే అభ్యర్థులుగా ప్రకటించింది. మూడో అభ్యర్థిని ప్రకటించే ఆలోచన చేయడం లేదు.
అది వైసీపీ రాజ్యసభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కలిచి వచ్చే అంశం. ఖర్చునీది.. గెలిపించే పూచీ నాది అని జగన్, విజయసాయిరెడ్డిలు ప్రభాకర్ రెడ్డికి హామీనిచ్చారట. ఆచరణలోను ఖర్చు అంతా ప్రభాకర్ రెడ్డి పెట్టుకుంటున్నారు. మరో రెండు వారాలు జల్సా చేసి వద్దామని వివిధ ప్రాంతాలకు వెళ్లారు వైకాపా ఎమ్మెల్యేలు. ఇప్పుడు వారిని క్యాంప్ లుగా పెట్టి పోషించాల్సిన అవసరం లేదు జగన్ పార్టీకి. అందుకే క్యాంప్ లను ఖాళీ చేయిస్తున్నారట. నాలుగు రోజులు ఇక్కడే ఉంటాం. బాగుందని చెబుతున్నారట ఎమ్మెల్యేలు. అమ్మో అంత ఖర్చా.. వద్దే వద్దు అంటున్నారట ప్రభాకర్ రెడ్డి. దీంతో వైకాపా ఎమ్మెల్యేలకు బెంగ పట్టుకుంది. ఏదో చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు అది వద్దంటారా అంటూ సెటైర్లు వేస్తున్నారని తెలుస్తోంది. 
రాజ్యసభ ఎన్నికల పుణ్యమా అని విదేశాలకు వెళ్లే చాన్స్ వచ్చింది. లక్షల్లో ఖర్చు మాకు తప్పింది. అదండీ వరుస. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*