ఇంతకూ ఆమె ఏం ఆశించారో ఏమో?

పురాతన కాలంలో కొన్ని హీరోయిన్ వేషాలు వేసిన తర్వాత.. సుదీర్ఘకాలం గ్యాప్ తీసుకుని.. తర్వాత కేరక్టర్ నటిగా ఎంట్రీ ఇచ్చి.. ఆ స్లాట్ లో స్థిరపడిన సీనియర్ నటి కవిత కు రాజకీయాసక్తి చాలానే ఉంది. సినిమా వాళ్లంతా, వెటరన్ జీవితంలో అవకాశాలు జీరో అయిపోయిన తర్వాత.. రాజకీయాల్లోకి ప్రవేశిస్తే సంపాదనకు మాత్రం ఢోకా ఉండదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆమె ఏం అనుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో తెలియదు గానీ.. చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ సేవలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో అతి తరచుగా తెలుగుదేశం మీద తన అసంతృప్తిని కూడా వెళ్లగక్కుతూనే ఉన్నారు.

ఆమె పాపం చాలా సార్లు కళ్లలో నీళ్లు పెట్టుకుని.. తెలుగుదేశం తనకు అన్యాయం చేస్తున్నదని వాపోయారు. ఇంతకూ ఆమె తెదేపానుంచి ఏం ఆశించారో.. ఏం అన్యాయం జరిగిందో మాత్రం వివరించలేదు. ఆమె  తన స్థాయి గురించి ఏం అంచనా వేసుకున్నారో గానీ.. నాకు సరిగ్గా ఈ పార్టీలో మర్యాద జరగడం లేదు.. అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటీవల పార్టీనుంచి బయటకు వచ్చేశారు. ఆ వెంటనే.. కొన్నిరోజులకు భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

ఇప్పుడు ఈ సీనియర్ నటికి భాజపా నుంచి శుభవార్త ఏంటంటే.. ఆమెకు సముచిత రీతిలో ప్రాధాన్యం కల్పిస్తాం అని కమల నాయకులు ప్రకటించారు.

అయితే తెలుగుదేశం నుంచి తన భవిష్యత్ ప్రస్థానానికి, అది కూడా ఏపీలో, భాజపాను ఆమె ఎందుకు ఎంచుకున్నారో.. ఎవరు సలహ ఇచ్చారో ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. తెలుగుదేశం లో సాధ్యం కానిది.. ఆమె భాజపాలో ఏం సాధిస్తుందో తెలియడం లేదు. మళ్లీ కొన్నాళ్ల తర్వాత అక్కడ కూడా.. తనకు అన్యాయం జరిగింది.. ప్రాధాన్యం ఇవ్వడం లేదు.. అంటూ వాపోయే పరిస్థితి వస్తుందా అని పలువురు అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఏపీలో భాజపా భవిష్యత్తే అగమ్యగోచరంగా ఉంది. ఆ పార్టీలో ఇప్పుడున్న ఏపీ నాయకులే.. భవిష్యత్ రాజకీయ జీవితం కావాలంటే.. ఇతర రాష్ట్రాలనుంచి రాజ్యసభకు వెళ్లడం లాంటి ఆప్షన్స్ వెతుక్కోవాలి. అంతలేసి అవకాశాలు.. సినిమా చాన్సెస్ ఉడిగిపోయిన ఈ హీరోయిన్ కు వారెందుకు ఇస్తారు? అంటే తనకు ఏం కావాలో క్లారిటీ తో చెప్పకుండా పార్టీలోకి వెళితే.. మళ్లీ అసంతృప్తి తప్పదని పలువురు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*