టీ.కాంగ్రెస్ సంచలన నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని తీర్మానించింది. ఈ మేరకు సిఎల్పీ భేటీలో కీలకాంశాలపై చర్చించారు. తాను ముందుగా పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదించగా.. మీరు ఒక్కరే ఎందుకు అంతా రాజీనామా చేద్దామని ప్రతిపాదించారు మిగతా వాళ్లు. అందుకే అంతా ఓకే చెప్పారు. తమ నిర్ణయాన్ని వారు ఏఐసిసికి ప్రతిపాదించారు. అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇందుకు సమ్మతిస్తారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. స్పీకర్ మధుసూధానాచారి సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం లేదనేది కాంగ్రెస్ చేస్తున్న వాదన. గవర్నర్ నరసింహన్ సమక్షంలో జరిగిందీ సంఘటన. కాబట్టి ఏవైనా చర్యలు తీసుకుంటే గవర్నర్ తీసుకోవాలి. కానీ ఆయన ఏ పని చేయలేదు. సిఎల్పీ నేత జానారెడ్డిని కావాలని సస్పెండ్ చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవంగా జానారెడ్డి నిన్న ఎలాంటి ఆందోళన చేయలేదు. కానీ ఆయన్ను తప్పించారు. మరోవైపు జిల్లాల వ్యాప్తంగా ఆందోళనలు చేయాలనే అభిప్రాయానికి వచ్చారు నేతలు. 
సిఎం కేసీఆర్ సూచనతోనే మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ ఆసుపత్రిలో చేరారనే ప్రచారం సాగుతోంది. దెబ్బ తగలడం అనేది ఒక డ్రామాగా కాంగ్రెస్ అభివర్ణించింది. వాస్తవంగా స్వామి గౌడ్ చేతలు, వ్యవహారశైలి అనుమానాలకు తావిస్తోంది. మీడియాతో మాట్లాడటం, కేసీఆర్ చెబితేనే ఆసుపత్రికి వెళ్లానని స్వామి గౌడ్ చెప్పడం మరికొన్ని సందేహాలకు తావిచ్చింది. ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ కాంగ్రెస్ నేతలను కట్టడి చేసే ఆలోచన చేస్తున్నారు. అందుకే గోల చేసిన వారిని చేయని వారిపై వేటు వేసేలా ప్లాన్ చేసారు. కానీ ఇది కాంగ్రెస్ కు ఆయుధంగా మారనుంది. దెబ్బ తగలక పోయినా తగిలినట్లు డ్రామా ఆడారనే విషయం బయట పడితే అసలుకే మోసం వస్తోందన్నది నిజం. అందుకే అది బయటకు రాకుండా రెటీనాకు దెబ్బ తగిలిందనే రీతిలో వైద్య రిపోర్టులు చూపిస్తున్నారంటున్నారు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*