స్వామి గౌడ్ కు గాయం నిజం కాదా…

శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కు గాయమైన వైనంపై అనుమానాలు నెలకున్నాయి. అసెంబ్లీలో హెడ్ సెట్ విసిరిన తర్వాత చాలా సేపటికి స్వామి గౌడ్ ను వీల్ చైర్ లో కూర్చో పెట్టారు. కానీ ఆయనకు గాయం అయినట్లు విజువల్స్ లో ఎక్కడా లేదు. పైగా కంటికి దెబ్బ తగిలినా హాయిగా మీడియాతో మాట్లాడుతున్నారు. అదీ చాలా పెద్దగా తన వాయిస్ వినిపిస్తున్నారు. కంటికి దెబ్బ తగిలితే మాట్లాడవద్దని డాక్టర్లు సూచిస్తారు. కానీ అవలీలగా మాట్లాడేస్తున్నారు. స్వామి గౌడ్ కంటి రెటీనాకు దెబ్బ తగిలిందని వైద్యులు పైకి చెబుతున్నారు. కానీ అది అంత తీవ్రం కాదనేది వారి వాదన. కాకపోతే కావాలని పట్టుబట్టి సరోజన్ కంటి ఆసుపత్రిలో ఆయన్ను ఉంచుతున్నారనే చర్చ సాగుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ప్రతీకారం తీర్చుకునేందుకు మంచి అవకాశం దొరికింది. అందుకే ఆయన్ను ఆసుపత్రిలో చేర్చాలనే ప్రపోజల్ వచ్చిందట. అందుకే స్వామి గౌడ్ ను ఆసుపత్రికి చేర్చారని కాంగ్రెస్ సందేహం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలోను ఇదే విషయంపై జోరుగా ప్రచారం సాగుతోంది.  
గాయం చూపిస్తే రాజీనామా…
అసెంబ్లీలో తాను విసిరిన హెడ్ సెట్ వల్ల శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ కు గాయం అయిందని రుజువు చేస్తే తాను క్షమాపణ చెప్పి రాజీనామా చేస్తానని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. బలమైన సమాచారం ఆయనకు ఉంది. అందుకే ఇలా సవాల్ విసిరారు అంటున్నారు. హెడ్ సెట్ విసిరిన 17 నిమిషాల తర్వాత వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టి గాయమైందని చెబుతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. అయితే స్వామిగౌడ్ కు స్వల్ప గాయం అయిందని, ఆయనను చికిత్స నిమిత్తం సరోజిని కంటి ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. గాయం చిన్నదైనా, పెద్దదైనా హెడ్ సెట్ విసరడం భావ్యం కాదనేది ప్రజల భావన. అసెంబ్లీలో ఇలా సభ్యులు వ్యవహరించడం సిగ్గుచేటు. గతంలో టీఆర్ఎస్ నేతలు ఇంత కంటే దారుణంగా వ్యవహరించిన రోజులను కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. హరీష్ రావు బల్లలు ఎక్కి మరీ గవర్నర్ పై బుక్ లు విసిరిన సంగతి నిజం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*